బీ కేర్‌ఫుల్.. ఇలాంటి సమస్యలతో బాధ పడేవాళ్లకు పైనాపిల్ విషంతో సమానం..!
చలికాలం, వేసవికాలం..ప్రతి సీజన్‌లోనూ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంత మంది సీజన్ లేని పండ్లను కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అలాగే కొందరు పైనాపిల్‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ముక్కలుగా కట్ చేసుకుని, జ్యూస్ చేసుకుని రకరకాలుగా తింటుంటారు. అయితే, మీరు కూడా పైనాపిల్ ఇష్టంగా తింటున్నారా..? అయితే, మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైనాపిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ ను అధికంగా తినడం వల్ల మీకు అనేక సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 10, 2025 | 7:41 AM

పైనాపిల్ ఒక పోషకాలున్న పండు. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, రాగి లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కానీ, పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో గుండెల్లో మంట, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, పైనాపిల్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

పైనాపిల్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లకు పైనాపిల్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. అలగే, డయాబెటిక్ రోగులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే ఇది చాలా తీపిగా ఉంటుంది. దానిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు పైనాపిల్ తింటే, వారి చక్కెర స్థాయి పెరుగుతుంది. సమస్య పెరిగే అవకాశం ఉంది.

మరికొంత మందికి పైనాపిల్ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. వారికి ముక్కులో దురద, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటివి ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాన్ని తినడం మానేయండి. గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినకుండా ఉండాలి. ఎందుకంటే పైనాపిల్ కోర్ గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం కలిగిస్తుంది.

కొంతమందికి దంతాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే తీపి, పుల్లని రెండూ ఉండటం వల్ల, ఇది మీ దంతాలలో సున్నితత్వం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, పైనాపిల్ ను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. రోజుకు కేవలం 200 మిల్లీగ్రాములు మాత్రమే పైనాపిల్ తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే మాత్రం కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

పైనాపిల్ ను పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. నోటిపూత సమస్యతో బాధ పడే వాళ్లు సైతం పైనాపిల్ ను తినడం ఆరోగ్యానికి నష్టం చేకూర్చుతుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ ను ఎక్కువగా తీసుకోకూడదు.




