Nose Shape Analysis: ముక్కు ఆకారం వ్యక్తిత్వానికి అద్దమని తెలుసా..! ముక్కు ఏ ఆకారంలో ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే..
శరీర అవయవాల్లో పంచేంద్రియాలు మనస్సు అధీనంలో పని చేస్తుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి. ఈ పంచేంద్రియాల్లో ఒకటి ముక్కు. ఇది మానవ శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటి. ముక్కు వాసన తెలియజేస్తుంది. అయితే ఈ ముక్కు ఆకారం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమందికి గుండ్రని ముక్కులు ఉంటాయి, మరికొందరికి పొడవైన లేదా నిటారుగా ఉండే ముక్కులు ఉంటాయి. కొంతమందికి చిలుక ముక్కు ఉంటుంది. అయితే ఈ ముక్కు తీరు ద్వారా అనేక రహస్యాలు బయటపడతాయి. ముక్కు ఆకారం వ్యక్తి వ్యక్త్వితనికి అద్దం వంటిది. కనుక ముక్కుని పరిశీలించి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారి ప్రవర్తన ద్వారా మనం అంచనా వేయగలిగినట్లే మన శరీర భాగాలైన కళ్ళు, చెవులు, ముక్కు, వేళ్లు , పెదవుల ఆకారం ద్వారా మనుషుల స్వభావాన్ని గుర్తించవచ్చు. అంతే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. ముక్కు ఆకారం ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? అతని లక్షణాలను, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కనుక వ్యక్తుల ముక్కు ఆకారం ద్వారా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ రోజు ఏ రకమైన ముక్కు ఉంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసుకుందాం..
పొడవైన ముక్కు: ముక్కు పొడవుగా ఉంటే.. ఇటువంటి వ్యక్తులు కొన్నిసార్లు తమ మాటలతో ఇతరులను బాధపెడతారు. ప్రతి విషయంలోనూ దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఇతరులతో సంబంధాలను కొనసాగించడానికి ఆసక్తి చూపరు. అయితే ఆధ్యాత్మిక పరమైన విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఖరీదైన, విలువైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు.
చిన్న ముక్కు: చిన్న ముక్కు ఉన్నవారు చిన్నపిల్లల మనసతత్వం కలిగి ఉంటారు. ప్రతిదాన్ని జోక్‌గా తీసుకుంటారు. అంతే కాదు తమ చుట్టూ ఉన్న వారితో సరదాగా గడుపుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ వ్యక్తులు మోసపూరితంగా ఉంటారు. తమ స్వలాభం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులతో ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాదు వీరికి సమాజం పట్ల ఒక దృక్పథం ఉంటుంది. జీవితంలో తమ సొంత ఆలోచనలో ముందుకు వెళ్తూ తమదైన ముద్ర వేస్తారు. వీరి అందరితో కలిసిమెలిసి, స్నేహపూర్వక జీవితాన్ని గడిపే వ్యక్తులు.
గుండ్రని ముక్కు: గుండ్రని ముక్కు ఉన్నవారు అందరినీ సమానంగా చూస్తారు. వీరికి ఎలాంటి వివక్షత లేదు. తాము తక్కువ స్థాయి వారమని మర్చిపోయి అందరితో కలిసిపోతారు. సంతోషంగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు. ఎల్లప్పుడూ ఇతరులను సంతోషపరుస్తారు. అందరితో ప్రేమగా, నమ్మకంగా ఉండే ఈ గుణమే వీరిని అందరికీ దగ్గరగా చేస్తుంది.
చదునైన ముక్కు: ఎవరికైనా చదునైన ముక్కు ఉంటే వీరు భావోద్వేగం గల వ్యక్తులు. ఇతరుల బాధలకు ప్రతిస్పందించే ఈ వ్యక్తులు, సహాయం చేయడంలో ఒక అడుగు ముందుంటారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే ఈ వ్యక్తులు దేవునిపై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు.
చిలుక ముక్కు: కొంతమందికి చిలుక ముక్కు వంటి ముక్కు ఉంటుంది. ఇలాంటి ముక్కు ఉంటే.. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు.. కష్టపడి పనిచేయడం ద్వారా జీవితంలో విజయం సాధిస్తారు. వీరు ఏ పని చేసినా పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. వీరు నిస్వార్థపరులు, స్వచ్ఛమైన మనస్సు గలవారు. ఇతరులు ఏమి చెబుతారో పెద్దగా పట్టించుకోరు. తమ సొంత మార్గాన్ని అనుసరిస్తారు. తమ లక్ష్యాలను సాధిస్తారు.
ఇరుకైన ముక్కు: ఇరుకైన ముక్కు ఉన్నవారికి ముక్కు చివర కోపం ఉంటుంది. ఈ వ్యక్తులు క్రోధస్వభావం కలిగి ఉంటారు. ఫ్యాషన్ పట్ల బలమైన మక్కువ కలిగి ఉంటారు. వీరు తమ విజయానికి దోహదపడిన వారిని, తమ ఉన్నతకి కారణమైన వారిని.. చివరకు తమ క్లాస్‌మేట్‌లను మరచిపోయే ధోరణిని కలిగి ఉంటారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి