Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanuatu: సాహసాలు ఇష్టమా.. ప్రకృతికి దగ్గరగా గడపాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే ఈ దేశం చుట్టేయండి.. డీటైల్స్ మీ కోసం..

అందమైన దేశాల్లో వనువాటు ఒక దేశం. ఇక్కడ ప్రకృతి అందాలు, చేసే ప్రయాణం పర్యాటకులకు ఎంతగానో ఆస్వాదించవచ్చు. ఈ దేశంలో చేసే ప్రయాణం చిరస్మరణీయంగా ఉంటుంది. వనువాటు మూడు కోట్లకు పైగా జనాభా కలిగిన చిన్న దేశం. ఈ దేశం అడగడుగునా అందాలతో నిండి ఉంటుంది. ఎవరైనా ఈ దేశంలో మొదటిసారి వెళ్ళితే ఎంత ఇష్టంగా పర్యటిస్తే.. అదే విధంగా ఎన్ని సార్లు వెళ్ళినా ఆ దేశంలో ఇంకా ఏదో చూడాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ రోజు వనువాటు దేశంలో చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Vanuatu: సాహసాలు ఇష్టమా.. ప్రకృతికి దగ్గరగా గడపాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే ఈ దేశం చుట్టేయండి.. డీటైల్స్ మీ కోసం..
Vanuatu Island
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2025 | 1:53 PM

వేసవి సెలవుల్లో ఎవరైనా సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేయాల్సి వస్తే.. ప్రజలు సహజ దృశ్యాలను ఆస్వాదించడమే కాదు.. సాహసం, వివిధ రకాల కార్యకలాపాలను కూడా చేయగల ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి ప్రదేశాల గురించి వెదికి వెదికి మరీ తమ పర్యటన లిస్టు లో చేర్చుకుంటారు. అటువంటి వారికి వనువాటు దేశం గొప్ప ఎంపిక. ప్రకృతికి ప్రేమికులకు వనువాటు గొప్ప గమ్యస్థానం. ఈ దేశం అందాలతో నిండి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ తినే ఆహారం నుంచి సంస్కృతి, సంప్రదాయాలు, కార్యకలాపాలు చాలా నచ్చుతాయి. కనుక వేసవిలో వనువాటు దీవులలో పర్యటిస్తే అద్భుతమైన అనుభవాలను పొందవచ్చు. ఇందులో అడవులలోని మారుమూల గుహల నుంచి అందమైన జలపాతాల వరకు సందర్శించి జీవితంలో గొప్ప జ్ఞాపకాలను పదిల పరచుకోవచ్చు.

ప్రయాణాలు అంటే ఇష్టం ఉన్నవారితో పాటు.. అప్పుడప్పుడు ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారు వనువాటులో పర్యటించడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడ చాలా ప్రదేశాలు వండర్‌ల్యాండ్‌లో పర్యటిస్తున్న అనుభూతినిస్తాయి. సినిమాల్లో చూసిన చిత్రం కదులుతూ కనుమ ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. వనువాటు దేశంలో ఏ ప్రదేశాలను చూడవచ్చు? ఎటువంటి కార్యకలాపాలు చేయవచ్చో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆకర్షించే అగ్నిపర్వతాలు

వనువాటులోని టన్నా ద్వీపంలోని మౌంట్ యాసుర్ అగ్నిపర్వతం చురుకుగా ఉంది. ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఎవకైనా సాహసయాత్రలంటే ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ అగ్ని పర్వతాల దగ్గరకు వెళ్ళండి. రాత్రి సమయంలో చీకటి కాన్వాస్ పై నక్షత్రాల్లా మెరుస్తున్న లావాను చూడటం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో స్టాప్ ఉంది. అక్కడ నుంచి అగ్నిపర్వతం చూడడం ఒక అద్భుతమైన దృశ్యంగా ఉంటుంది.

ఏఏ అనుభవాలు అద్భుతంగా ఉంటాయంటే

వనువాటులో వర్షారణ్యాలలో దట్టమైన చెట్ల నీడలో ఆడి పాడవచ్చు. ఊయల ఊగవచ్చు. అంతేకాదు ఇక్కడ సహజంగా ఏర్పడిన మంచినీటి నీలి బోరియలున్నాయి. ఇక్కడ ఈత కొట్టవచ్చు. నిజానికి ఇక్కడ మీరు తరచుగా స్థానిక ప్రజలు నిర్మించిన గుడిసెల్లో నివాసం అందమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ బట్టలు మార్చుకోవడం, శీతల పానీయాలు, ఊయలలు, ఆహారం మొదలైన ప్రాథమిక వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడకు వెళ్ళడం వలన జీవితంలో మొదటిసారి అనేక అందమైన అనుభవాన్ని పొందవచ్చు.

స్కూబా డైవింగ్

వనువాటులోని ఎస్పిరిటో శాంటోలో స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించవచ్చు. అయితే ఈ స్కూబా డైవింగ్‌ చేసే సమయంలో సముద్రంలో మునిగిపోయిన రెండవ ప్రపంచ యుద్ధం శిథిలాలను చూడటం మరింత ఉత్తేజకరమైనది. ఈ ప్రదేశాన్ని మిలియన్ డాలర్ పాయింట్ అని పిలుస్తారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

బ్లూ కేవ్‌లో ఈత కొట్టడం గొప్ప అనుభూతి

వనువాటులో టన్నా బ్లూ కేవ్‌లో ఈత కొట్టవచ్చు. ఈ గుహ లోపల స్వచ్చమైన నీలిరంగు నీరు కనిపిస్తుంది. గుహలోని రంధ్రం నుంచి వెళ్ళే కాంతి.. అప్పుడు కనిపించే దృశ్యం చూపరుల మనసులో ఓ అద్భుతంగా నిలుస్తుంది. ఇక్కడ బస చేయడానికి కూడా సదుపాయం ఉంది.

ఆకట్టుకునే సంస్కృతి, సంప్రదాయాలు

ఎవరికైనా కొత్త దేశాల అందంతో పాటు .. ఆదేశానికి సంబంధించిన సంప్రదాయాలు, సంస్కృతిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వనువాటులోని ఫనాలా ఉత్సవంలో పాల్గొనాలి. అయినప్పటికీ ఈ ఉత్సవాలు రెండు రోజులు మాత్రమే ఉంటాయి. కనుక ఈ ఉత్సవాలు జరిగే సరైన సమయం తెలుసుకోవడం ముఖ్యం. దీనితో పాటు ఇక్కడ నివసించే కో నంబాస్ తెగ మాలెకులాను కూడా కలవవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ప్రధాన రహదారి లేదు,.. ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులు అయినా జీవించాలి అనుకుంటే.. ఫనలాలో పర్యతించండి. ఇక్కడ నివసించే గిరిజనుల జీవనశైలిని చూడవచ్చు.

సాంప్రదాయ బంగీ జంపింగ్‌

ఎవరికైనా సాహసాలు అంటే ఇష్టం అయితే వనువాటులో బంగీ జంపింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ డైవింగ్ లేదా నాంగోల్.. ఆధునిక టెక్నిక్ ఆధారంగా నిర్మించబడలేదు. చెక్క టవర్లు నిర్మించబడ్డాయి,. అక్కడ నుండి గంట సహాయంతో బంగీ జంపింగ్ చేస్తారు. ఇక్కడ ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి