Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పొరపాటున కూడా ఇతరుల నుంచి ఈ వస్తువులను తీసుకోవద్దు.. శనిశ్వరుడిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే..

మనిషి తన జీవిత ప్రయాణంలో ఇచ్చి పుచ్చుకోవడం తప్పని సరి. ఇతరుల అవసరాలకు వస్తువులను ఇస్తాం..అదే విధంగా మన అవసరాల కోసం ఇతరుల నుంచి వస్తువులను తీసుకుంటాం. కొన్ని సార్లు ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు బాగా నచ్చితే అడిగి తీసుకుంటాం కూడా. అయితే ఎంత నచ్చినా.. ఎంత అవసరం అయినా సరే ఇతరుల నుంచి కొన్ని వస్తువులను అడగవద్దు.. పొరపాటున కూడా వాటిని మన ఇంటికి తీసుకురావద్దని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. ఇలా తీసుకుని రావడం వల్ల మొత్తం కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

Vastu Tips: పొరపాటున కూడా ఇతరుల నుంచి ఈ వస్తువులను తీసుకోవద్దు.. శనిశ్వరుడిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే..
Vastu Tips For Home
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2025 | 12:42 PM

వాస్తు శాస్త్రం మన జీవితానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉంచుకునే ఏ వస్తువులు అయినా మనిషి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు సానుకూలతను తెస్తాయి. అదే సమయంలో కొన్ని వస్తువులు ఇంట్లోకి ప్రతికూలతను కూడా తెస్తాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.. ముఖ్యంగా ఇతరుల నుంచి కొన్ని వస్తువులను పొరపాటున కూడా అడిగి తీసుకోవద్దు.. వాటిని ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఇలా తీసుకునే వస్తువుల వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. కనుక ఈ రోజు ఏ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోకూడదో తెలుసుకుందాం..

ఓల్డ్ ఫర్నిచర్: ఫర్నిచర్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం.. చాలా మంది తమ ఇంట్లో ఫర్నిచర్ ను అపురూపంగా చూసుకుంటారు. కొత్త ఫర్నిచర్ కొన్న సమయంలో తమ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ ను ఇతరులకు ఇచ్చి వేస్తారు కూడా.. అలా ఎవరైనా వేరొకరి ఇంటి నుంచి ఓల్డ్ ఫర్నిచర్‌ను ఇంట్లోకి తీసుకువచ్చినప్పుడు.. ఆ ఇంటి శక్తి కూడా ఫర్నిచర్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రతికూల శక్తి కూడా ఉండవచ్చు. అప్పుడు ఆ ఇంట్లోని వారి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక వేరొకరి ఇంటి నుంచి పాత ఫర్నిచర్‌ను ఇంటికి తీసుకురాకుండా.. అది కూడా ఉచితంగా తీసుకు రాకుండా జాగ్రత్త వహించండి.

ఇతరుల పాదరక్షలు: మనిషి ధరించే చెప్పులు, బూట్ల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఇతరుల బూట్లు, చెప్పులు నచ్చితే వాటిని ధరించే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా ఇతరుల చెప్పులను ధరించి తమ ఇంటికి వస్తారు కూడా.. జ్యోతిష్య శాస్త్రంలో పాదాలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయని చెప్పబడింది. కనుక ఇతరుల బూట్లు లేదా చెప్పులు మనం ధరిస్తే.. వారి ప్రతికూల శక్తి మనలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల జీవితంలో సమస్యలు రావచ్చు. కనుక పొరపాటున కూడా ఇతరుల బూట్లు, చెప్పులు ధరించవద్దు. ఈ అలవాటు ఉంటే వెంటనే స్వస్తి చెప్పండి.

ఇవి కూడా చదవండి

ఇతరుల గొడుగులు: ఎండ, వాన నుంచి రక్షణ ఇచ్చే గొడుగు కూడా ప్రతికూల శక్తినిస్తుందని నమ్మకం. కనుక ఇతరుల గొడుగు తీసుకున్నప్పుడు ఇంటిలోకి ఆ గొడుగుని తీసుకుని వెళ్ళడం ఆశుభంగా పరిగణించబడుతుంది. ఏదైనా కారణం చేత మీరు వేరొకరి గొడుగు తీసుకురావాల్సి వస్తే.. దానిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళవద్దు.

విరిగిన వస్తువులు: ఇంట్లో విరిగిన వస్తువులు ఉంచడం మంచిది కాదు.. అదే సమయంలో ఇతరులకు చెందిన విరిగిన వస్తువులను ఇంట్లోకి తీసుకుని రావడం ఇంట్లో వాస్తు దోషానికి కారణమవుతుంది. విరిగిన వస్తువులను ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ కారణంగా ఇతరులకు చెందిన పగిలిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం, ఉంచడం మానుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు