రక్తహీనతను ముందే గుర్తించండిలా..! ముఖంలో కనిపించే మార్పులు ఇవే..!
ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య విస్తృతంగా కనిపిస్తోంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. ఐరన్ లోపం, విటమిన్ లేమి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల రక్తహీనత పెరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తొందరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

రక్తహీనత వల్ల శరీరంలోని ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని ప్రభావం చేతులు, కాళ్లు చల్లబడటం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలుగా బయటపడుతుంది. అంతేకాకుండా ముఖంపై కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపించొచ్చు. ముఖ్యంగా చర్మం పొడిబారిపోవడం, రంగు మారడం, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు రావచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఒత్తిడి, తీవ్రమైన పీరియడ్స్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం రక్తహీనతకు కారణమవుతుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తం కోల్పోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల ముఖం బలహీనంగా మారుతుంది, ముఖంలో కళ లేనట్టు అనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఐరన్ అధికంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
శరీరంలో ఐరన్ లోపం కారణంగా చర్మంపై ప్రభావం చూపుతుంది. ముఖం సహజమైన కాంతిని కోల్పోయి, తెల్లగా మారిపోతుంది. కొందరిలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం మెరుగైన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉండటం, చర్మం రంగు మారడం మొదలైనవి రక్తహీనత లక్షణాలు కావచ్చు. కాబట్టి ఈ సమస్యను అలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి.
ముఖంపై డార్క్ సర్కిల్స్, మొటిమలు కనిపించడమంటే కేవలం నిద్రలేమి లేదా స్ట్రెస్ కారణం అనుకోవడం తప్పు. ఇది రక్తహీనత కారణంగా కూడా ఉద్భవించవచ్చు. తగినంత రక్తం లేకపోతే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా నిద్ర సమయం క్రమంగా ఉన్నప్పటికీ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తే ఇది శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినట్టు సూచిస్తుంది.
చాలా మంది పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు. అయితే వాతావరణ మార్పుల వల్ల మాత్రమే కాకుండా రక్తహీనత కారణంగా కూడా చర్మం పొడిగా మారే అవకాశం ఉంది. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే చర్మం పొడిబారడం, దురద రావడం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఐరన్, విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది.
రక్తహీనతను తగ్గించుకోవాలంటే పోషకాహారంపై శ్రద్ధ పెట్టాలి. బెల్లం, ఖర్జూరం, పప్పులు, ఎండుద్రాక్ష, ఆపిల్, నేరెడు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తం పెరుగుతుంది. వీటితో పాటు పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, నిమ్మరసం వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
రక్తహీనత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు. సరైన పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం, మెరుగైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అలవాట్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి.