Fatty Liver Diet: తినే ఆహారంలో ఈ 5 పండ్లు చేర్చుకోండి.. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టండి..
ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది ఇది కాలేయంలో అవాంఛిత కొవ్వు పేరుకుపోవడం వల్ల వస్తుంది. కాలేయానికి ఏదైనా నష్టం జరిగితే అది మొత్తం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో టాక్సిన్స్ స్థాయిలు పెరగడానికి, జీవక్రియ అసమతుల్యతకు దారితీస్తుంది. కనుక ఈ ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కోసం తినే ఆహరంలో ఈ ఐదు రకాల పండ్లు చేర్చుకోమని గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ సూచిస్తున్నారు.

కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన, రెండవ అతిపెద్ద అవయవం. ఇది శరీరానికి 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన, చురుకైన కాలేయాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే సరైన ఆహారం తినక పోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. కాలేయం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని పనితీరు బలహీనపడితే..శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం అవుతుంది.
ఫ్యాటీ లివర్ పురోగతి చెందకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. ఇందులో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర , తగినంత నీరు త్రాగడం వంటివి తప్పనిసరి. అంతేకాదు కొన్ని పండ్లని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లు ఫ్యాటీ లివర్ సమస్యని తగ్గించడంలో చాలా సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి. విటమిన్ సి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది . కొవ్వు కాలేయ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆపిల్: ఆపిల్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది కాలేయంలో కొవ్వును తగ్గించడానికి, నిర్విషీకరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బొప్పాయి: బొప్పాయిలో విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాలేయంపై భారాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా ఫ్యాటీ లివర్ తో ఉంటే బొప్పాయి తినడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
కివి: కివి ఒక పోషకాలతో కూడిన పండు. ఇందులో విటమిన్లు , ఖనిజాల మిశ్రమం ఉంది.ఇది కాలేయ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇది కాలేయంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








