ఎయిర్ ఫ్రైయర్లు క్యాన్సర్‌కు కారణం అవుతాయా? నిపుణులు ఏమంటున్నారంటే?
ప్రస్తుతం చాలా మంది ఎయిర్ ఫ్రైయర్లు కొనడానికే ఎక్కువ ఆస్తకి చూపిస్తున్నారు. ఎందుకంటే, ఇవి ఎక్కువ నూనె, కేలరీలు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని రెడీ చేసి ఇస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రత వద్ద ఎయిర్ ఫ్రైయర్స్ ఉపయోగించడం వలన క్యాన్సర్ ప్రమాదం కలిగించే ప్రమాదం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
Updated on: Oct 17, 2025 | 2:53 PM

నిపుణులు అసలు ఎయిర్ ఫ్రైయర్స్ గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి చెప్పాలంటే ఎయిర్ ఫ్రైయర్స్ క్యాన్సర్‌కు కారణం కాదు,కానీ ఎయిర్ ఫ్రైయర్‌లు అక్రిలామైడ్‌లు అనే సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు , వీటితోనే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.

దీని గురించి గట్ హెల్త్ నిపుణుడు,డాక్టర్ డింపుల్ జాంగ్దా మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తుంది. చాలా మంది దీని బారిన పడుతున్నారు. దీనికి ముఖ్యకారణం తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి. అయితే ఇప్పుడు అంతా ట్రెండ్‌కు అలవాటు పడిపోయి, అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.ముఖ్యంగా ఆధునాతనపరికరాల వాడకం ఎక్కువైపోంది. అందులో చాలా మంది ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ ఉపయోగిస్తున్నారు.ఇది మంచిదే కానీ కొన్ని సార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. నాన్ స్టిక్ పూత అనేది ఆహారంలోకి వివిధరకాల సమ్మేళనాలను విడుదల చేస్తుంది. అయితే ఎయిర్ ఫ్రైయర్స్ ఎక్కువగా నాన్ స్టిక్ పూతతో తయారు చేయబడి ఉంటాయి.

వీటిని మనం ఉపయోగించినప్పుడు, వేడి వలన విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఇది మీ ఆహారంలోకి కూడా వెళ్లి, అది విషపూరితమైనదిగా మారుతుంది. దీర్ఘకాలం దీనిని ఉపయోగించడం వలన ఇది కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.

చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేసే సమయంలో ఎయర్ ఫ్రైయర్స్ అక్రిలామైడ్, పాలీ సైక్లిక్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి క్యాన్సర్ కారకాను ఇవి విడుదల చేస్తాయి. అయితే ఇవి ఎక్కువగా తృణధాన్యాలు, బంగాళ దుంపలు, మాసం, గుడ్లు , చేపలు వంటి ఉప్పత్తుల సమయంలో ఎక్కువగా వస్తాయంట. అందుకే వీటిని ఎయిర్ ఫ్రైయర్స్‌లో ఉడికించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఎయిర్ ప్రైయర్స్ ఉపయోగించే వారు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలంట. అందులో ముఖ్యంగా సిరామిక్ లేదా స్టీల్ పూతతో ఉన్న ఎయిర్ ప్రైయర్స్ కొనుగోలు చేయడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని కాస్త తగ్గించుకోవచ్చును. అలాగే మీరు ఎయిర్ ఫ్రైయర్స్ ఉపయోగించనప్పుడు, తక్కువ ఉష్ణోగ్రత పై ఉడికించడం మంచిదంట. మీ ఆహారం కోసం దాదాపు అర టీస్పూన్ నూనె మాత్రమే ఉపయోగించాలంట.



