AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యానర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి.. కన్నీరు పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి లేఖ

సోషల్ మీడియాలో రోజూ రకరకాల పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక యువకుడు చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.. కన్నీరు పెట్టిస్తోంది.. జీవితం క్షణభంగురం అంటే ఇదేమో అనిపిస్తుంది. తాను క్యాన్సర్ తో పోరాడి పోరాడి అలసి పోయానని.. ఇదే తన జీవితంలో చివరి దీపావళి అని.. 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్ లో చేసిన పోస్ట్ అందరినీ కదిలించింది.

క్యానర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి.. కన్నీరు పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి లేఖ
Viral News
Surya Kala
|

Updated on: Oct 17, 2025 | 12:40 PM

Share

ఓ యువకుడు జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు.. తన తల్లిదండ్రులకు అండగా ఉండాలని.. స్నేహితులతో సరదాగా గడపాలని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు.అయితే విధి మరొక విధంగా ఆలోచించింది.. అతని జీవితాన్ని క్యాన్సర్ భూతం చిద్రం చేసింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే మరణం అంచులకు చేరుకున్నాడు. తనపై క్యాన్సర్ గెలిచింది.. ఇదే చివరి దీపావళి .. ఇక వెలుగులు చూడలేను అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

క్యాన్సర్ గెలిచింది ఫ్రెండ్స్.. మళ్ళీ కలుద్దాం…” ఈ కొన్ని పదాలతోనే 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్‌లో తన బాధను వ్యక్తం చేశాడు. లక్షలాది మందిని ఏడిపించాడు. పెద్దప్రేగు క్యాన్సర్ స్టేజ్ 4 తో పోరాడుతున్న యువకుడు .. వైద్యులు కూడా చెప్పేశారు… జీవితం ఎప్పుడు ముగుస్తోందో.. అందుకే జీవితంపై ఆసలు వదులుకున్నానని.. బహుశా నాకు చివరి దీపావళి అవుతుందని ఆ యువకుడు చెప్పాడు.

రెడ్డిట్లోని ‘ట్వంటీస్ఇండియా’ గ్రూప్‌లో షేర్ చేయబడిన పోస్ట్‌లో ఆ యువకుడు 2023లో తనకు పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అది కూడా స్టేజ్ 4 లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని రాశాడు. అనేక కీమోథెరపీ సెషన్‌లు , సుదీర్ఘ సమయం ఆసుపత్రి లో చికిత్స తర్వాత వైద్యులు ఇప్పుడు చికిత్స మిగిలి లేదని ప్రకటించారు. నేను ఈ సంవత్సరం చివరి వరకు కూడా బ్రతకకపోవచ్చు.”

ఇవి కూడా చదవండి

దీపావళి వెలుగులను నేను చూడటం ఇదే చివరిసారి కావచ్చు. నేను వెలుగులను, ఆనందాన్ని, శబ్దాన్ని మిస్ అవుతాను. ఇది వింతగా ఉంది.. కాదా? జీవితం ముందుకు సాగుతోంది.. నా జీవితం నెమ్మదిగా మసకబారుతోంది. వచ్చే ఏడాది నా స్థానంలో ఎవరో ఒకరు దీపం వెలిగిస్తారు, నేను కేవలం జ్ఞాపకంగా ఉంటాను” అని రాశాడు.

Cancer won guys , see ya !!! byu/Erectile7dysfunction inTwentiesIndia

చాలా కోరికలు నెరవేరలేదు ఆ యువకుడు తన పోస్ట్‌లో ఎప్పటికీ నెరవేరని కోరికలను కూడా ప్రస్తావించాడు. “నేను ప్రపంచాన్ని చుట్టి రావాలనుకున్నాను. నేను సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాను. నేను ఒక కుక్కను దత్తత తీసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇవన్నీ కేవలం కలలు మాత్రమే. నాకు ఏదైనా కల గుర్తుకు వచ్చినప్పుడల్లా.. నాకు ఎంత సమయం మిగిలి ఉందో ఆలోచిస్తాను” అని తన కలను గుర్తు చేసుకున్నాడు.

ఆ యువకుడు ఇంకా “నా తల్లిదండ్రులు నుంచి దూరం కావడం నేను భరించలేకపోతున్నాను. నేను దీన్ని ఎందుకు వ్రాస్తున్నానో నాకు తెలియదు. బహుశా నేను ప్రపంచానికి వీడ్కోలు చెప్పే ముందు ఏదైనా గుర్తును వదిలి వెళ్ళడానికి.. నేను ఉన్నానని అని అందరికీ తెలియజేడానికి ఏమో అని చెప్పాడు.

 ప్రార్థనల వరద పోటెత్తింది. ఈ భావోద్వేగ పోస్ట్ వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియా ప్రార్థనలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ యువకుడి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. ఒక యూజర్ నిజంగా అద్భుతాలు జరిగితే.. దేవుడు ఈ అబ్బాయికి తోడుగా ఉండాలి” అని రాశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..