Tulasi Plant: ఇంట్లోనే తులసి మొగ్గల నుంచి తులసి మొక్కలను ఎలా పెంచుకోవాలో తెలుసా..!
హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను దేవతగా పూజిస్తారు. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు బహు అరుదు అని చేపవచ్చు. ఇంట్లో తులసిమొక్కని నాటిన తర్వాత ఆ మొక్క పచ్చగా అందంగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొత్త తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. దీనితో కొన్ని రోజుల్లో మీ కుండీలో తులసి మొగ్గల నుంచి కొత్త తులసి మొక్కలు మొలకెత్తుతాయి.

తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. దీనికి విశేషమైన, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించడమే కాదు ఇళ్లలో కూడా పూజిస్తారు. దీనిని సరైన దిశలో నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆనందం ,శ్రేయస్సు కూడా లభిస్తుందని నమ్ముతారు. కనుక మీరు ఇంట్లో తులసి మొక్కను నాటాలని ఆలోచిస్తుంటే.. సరైన పద్ధతిని గురించి తెలుసుకోండి. తులసి మొక్కను మొగ్గల నుంచి తులసి మొక్కలను పెంచవచ్చు.
తులసి మంజరి అంటే ఏమిటి? తులసి మొగ్గలు తులసి పువ్వులను తులసి మంజరి అని తనరు. ఈ పువ్వులలో చిన్న చిన్న తులసి విత్తనాలు ఉంటాయి.
తులసి మొగ్గల నుంచి విత్తనాలను ఎలా తీయాలి? ఎండిన పువ్వులను కోసి.. మీ అరచేతి వాటిని వేసుకుని మెల్లగా రుద్దినప్పుడు..విత్తనాలు బయటకు వస్తాయి. ఈ విత్తనాలు నాటడం వలన సులభంగా తులసి మొక్కలు మొలకలు వస్తాయి.
మొగ్గలకు సంబంధించిన నియమాలను తెలుసుకోండి.
తులసి మొగ్గలను ఎలా కోయాలి. మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క మొగ్గలు గోధుమ రంగులోకి మారినప్పుడు మాత్రమే దాన్ని కోయాలి. ఆదివారాలు లేదా మంగళవారాల్లో తులసి మొగ్గలను కోయకూడదు. మొగ్గల నుంచి విత్తనాలు తీసిన వెంటనే మొగ్గలను పారవేయకూడదు. వాటిని, వాడిన తులసిని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఎప్పుడూ తులసికి సంబంధించిన ఆకులు, మొగ్గలు, లేదా విత్తనాలు ఏవీ కాళ్ళ కింద పడకుండా చూసుకోండి.
తులసి మొగ్గల నుంచి కొత్త తులసి మొక్కను ఎలా పెంచుకోవాలి తులసి మొక్కల పువ్వులు .. మొగ్గలుగా మారి.. గోధుమ రంగులోకి వచ్చేవరకూ విడిచి పెట్టండి. తరువాత ఆ మొగ్గలను చేతులతో సున్నితంగా విరిచి తీసుకోండి. ఈ మొగ్గలను అరచేతులో వేసుకుని తేలికగా రుద్దండి. అప్పుడు మొగ్గల నుంచి విత్తనాలు బయటకు వస్తాయి. ఇప్పుడు రంధ్రాలున్న ఒక కుండీని తీసుకోండి. తరువాత.. దానిలో మంచి మట్టివేయండి. కొంత సూర్యకాంతి.. నేల తడిగా ఉండే విధంగా నీరు అందేలా చూసుకోండి. కొన్ని రోజుల్లో మొక్కలు మొలకెత్తుతాయి. వీటిని మీరు పిజించే తులసి కుండీలో వేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








