Srisailam: ఈ క్షేత్రం మోక్షానికి ద్వారం.. దక్షిణ కైలాసం.. ఒకే చోట శివ శక్తి రూపాల దర్శనం
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలంలోని చారిత్రాత్మక, పవిత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రార్థనలు చేశారు. ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మికత, విశ్వాసాల అద్భుతమైన సంగమం. ఇక్కడ శివుడు. శక్తి దేవత ఒకే సముదాయంలో కలిసి నివసిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు.. యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటి కూడా. దీని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే శివుడు, శక్తి ఇద్దరూ ఒకే ఆలయ సముదాయంలో ప్రతిష్టించబడ్డారు. అందుకే శ్రీశైలం హిందూ విశ్వాసాలకు ప్రత్యేకమైన సంగమంగా పిలువబడుతుంది.
శివుడు, శక్తి సంగమం శ్రీశైలం ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన , ప్రత్యేక లక్షణం దాని అరుదైన కలయిక: ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన “మల్లికార్జున జ్యోతిర్లింగం” గా భక్తులతో పూజలను అందుకుంటుంది. అంతేకాదు ఇక్కడ సతీదేవి 52 శక్తిపీఠాలలో ఒకటైన “భ్రమరాంబ శక్తిపీఠం” కూడా ఉంది. ఈ ప్రత్యేక లక్షణం ఆలయాన్ని ప్రత్యేకమైనదిగా, మొత్తం దేశంలోనే ఈ క్షేత్రం భిన్నమైనదిగా చేస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం సతీదేవి మెడ ఇక్కడ పడిపోవడంతో ఇది శక్తిపీఠంగా మారింది. శివుడు మల్లికార్జున రూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. ఈ ప్రదేశం భక్తులకు శివుడిని,శక్తిని ఒకే చోట దర్శిచుకునే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.
మోక్షానికి ద్వారం.. దక్షిణ కైలాసం పురాణాల నమ్మకాల ప్రకారం శ్రీశైలం ఆలయాన్ని “దక్షిణ కైలాసం” అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం భక్తుల కోరికలను నెరవేరుస్తుందని నమ్మడమే కాదు.. దీనిని సందర్శించడం వల్ల పునర్జన్మ చక్రం విముక్తి లభిస్తుందని , మోక్షం లభిస్తుందని బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న మల్లికార్జున లింగం స్వయంభుగా పరిగణించబడుతుంది. ఆలయ నిర్మాణం , ప్రాచీనత కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ద్రవిడ శైలి నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.. ఎత్తైన గోపురాలు, అందమైన శిల్పాలతో చెక్కబడిన స్తంభాలు, గోడలు భక్తులకు గొప్ప అనుభూతినిస్తాయి.
#WATCH | Andhra Pradesh: Prime Minister Narendra Modi performs Pooja and Darshan at Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam, Srisailam in Nandyal district.
Andhra Pradesh CM N Chandrababu Naidu also present.
(Source: ANI/DD News) pic.twitter.com/0AucuWV5wO
— ANI (@ANI) October 16, 2025
ఆలయ మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత శ్రీశైలం ఆలయ వైభవాన్ని స్కంద పురాణం, శివ పురాణం, లింగ పురాణం వంటి అనేక గ్రంథాలలో వర్ణించారు. కార్తికేయుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేశాడని.. పార్వతి దేవి భ్రమరం రూపంలో రాక్షసులను ఈ ప్రదేశంలోనే సంహరించిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబ. మల్లికార్జున అంటే మల్లికా అంటే పార్వతి, అర్జునుడు అంటే శివుడు.అందుకనే ఈ ఆలయం శివుడు, పార్వతిల కలయికను సూచిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు







