Personality Test: పొడవుగా లేదా పొట్టిగా మెడ ఉందా..! ఈ మెడ పొడవు వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..!
వ్యక్తిత్వ పరీక్షల ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన అనేక మర్మమైన లక్షణాల, వ్యక్తిత్వాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తిత్వ పరీక్షలో చాలా రకాలు ఉన్నాయి. నేటి వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి మెడ పొడవు ఆధారంగా అతని వ్యక్తిత్వం ఏమిటో చూద్దాం. ఈ వ్యక్తిత్వ పరీక్షలో మీ మెడ పొడవును చూసి మీ వ్యక్తిత్వం ఏమిటో కూడా మీరు తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఒక వ్యక్తి మనసత్వం ఏమిటి? ఎలా ఉంటాడు.. అనే విషయాలను వారి జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఆధారంగా తెలుసుకోవడానికి, జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తారు. లేదా వారు వారి పుట్టిన తేదీ ఆధారంగా సంఖ్యాశాస్త్రంపై ఆధారపడతారు. దీనితో పాటు వ్యక్తిత్వ పరీక్ష ద్వారా, వ్యక్తిత్వ పరీక్ష అనేక పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, అతని నిజ స్వభావం ఏమిటో తెలుసుకోవచ్చు. మీరు ఈ పద్ధతుల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవచ్చు. నేటి వ్యక్తిత్వ పరీక్షలో మెడ పొడవును చూసి మీ వ్యక్తిత్వం, మీ చుట్టూ ఉన్నవారి వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోండి.
మెడ పొడవు మీలో దాగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
పొడవాటి మెడ: మీకు పొడవాటి మెడ ఉంటే.. మీరు ఆకర్షణీయంగా ఉంటారు. తెలివైనవారని అర్థం. ప్రశాంతంగా ఉంటారు. మర్యాదగా ప్రవర్తిస్తారు. పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదోకటి తెలుసుకోవాలనే జిజ్ఞాసని కలిగి ఉంటారు. జీవితం గురించి లోతైన అవగాహన ఉంటుంది. సృజనాత్మకంగా ఉండటం వల్ల ప్రతిదాని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. తరచుగా మీ చుట్టూ ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటారు. వీరు స్వేచ్ఛను ఇష్టపడతారు. స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే బలమైన అంతర్ దృష్టి కలిగి ఉండటం వల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తారు. అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తంమీద తెలివితేటలు , అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని ఇతరులకు స్ఫూర్తినిచ్చే , మార్గనిర్దేశం చేసే ప్రభావవంతమైన నాయకుడిగా చేస్తాయి.
వీరిలో ముఖ్య వ్యక్తిత్వ లక్షణాలు: ఆకర్షణీయం, తెలివి, కరుణ, దయ, మంచి సంభాషణకర్త, ఊహాత్మకత, స్వతంత్ర, స్వావలంబన కలిగి ఉంటారు.
పొట్టి మెడ : షార్ట్ నెక్ ఉంటే దృఢమైన మనస్సు గలవారు. కష్టపడి పనిచేసే వ్యక్తి అని అర్థం. ఏవైనా సమస్యలకు సహేతుకమైన పరిష్కారాలను కనుగొనే నైపుణ్యం ఉంటుంది. అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుంది. అలాగే వీరి చర్యలు , నిర్ణయాలు చాలా దృఢంగా, స్థిరంగా ఉంటారు. బాధ్యతలను నెరవేర్చడానికి విశ్వసనీయంగా, కట్టుబడి ఉంటారు. ఇతరుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. అలాగే, వాస్తవంగా , ఆచరణాత్మకంగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి. అసాధారణమైన ఓర్పు ఉంటుంది. సరైన అవకాశాల కోసం వేచి ఉండేలా చేస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
ముఖ్య వ్యక్తిత్వ లక్షణాలు: దృఢ సంకల్పం, ఆచరణాత్మకత, వాస్తవికత, బాధ్యత, ఓర్పు, అనుకూల వీరి ముఖ్యమైన లక్షణాలు
మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి







