Get Rid of Migraine: మైగ్రేన్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు.. కొద్ది నిమిషాల్లో మాయం!

మైగ్రేన్ తలనొప్పి అనేది చాలా డేంజర్. కాబట్టి ఒక్కసారి వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదే విధంగా ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్, ఆందోళనకు గురైనా కూడా మైగ్రేన్ ఎటాక్ చేస్తుంది..

Get Rid of Migraine: మైగ్రేన్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు.. కొద్ది నిమిషాల్లో మాయం!
Get rid of Migraine
Follow us

|

Updated on: Nov 01, 2024 | 1:40 PM

ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎటాక్ చేసే సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా వచ్చే తలనొప్పి కంటే మైగ్రేన్ తలనొప్పితో మరిన్ని చికాకుగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి తలలో ఒక వైపు మాత్రమే వస్నతుంది. తలనొప్పి బాగా ఎక్కువగా వస్తుంది. అలాగే వికారంగా, వాంతులు వస్తాయి. ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా పడుకునే ఉండాలని అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ.. బయట పని చేసే వారికి మాత్రం మైగ్రేన్ ఎటాక్ చేస్తే చాలా ఇబ్బంది. అలాంటి సమయంలో ఈజీగా ఈ మైగ్రేన్‌ని తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకు ఈజీగా లభించే పదార్థాలతోనే మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

అల్లం టీ:

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో అల్లం టీ ఎంతో చక్కగా పని చేస్తుంది. అల్లం టీ తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య ఉంటే వెంటనే తగ్గుతుంది. పాలతో చేసిన అల్లం టీ తాగినా ఉపశమనం లభిస్తుంది. లేదంటే అల్లాన్ని దంచి.. నీటిలో వేసి మరిగించి తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి. మంటను, నొప్పిని తగ్గించడంలో అల్లం చక్కగా పని చేస్తుంది. మైగ్రేన్ లక్షణాలతో బాధ పడే వారికి అల్లం టీ మంచి రిలీఫ్ ఇస్ుతంది.

పుదీనా ఆయిల్:

మైగ్రేన్ తలనొప్పిని పుదీనా ఆయిల్‌తో కూడా తగ్గించుకోవచ్చు. నుదుటిపై పుదీనా ఆయిల్ రాయాలి. పుదీనా నుంచి గాఢంగా ఉండే మంచి సువాసన కలిగిన వాసనలు వస్తాయి. కాబట్టి త్వరగా మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చల్లదనం కూడా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

లావెండర్ ఆయిల్:

మైగ్రేన్‌‌‌ని తగ్గించడంలో లావెండర్ ఆయిల్ కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ నూనెను నుదుటిపై రాసి.. తలలో మాస్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. త్వరగా మంచి ఉపశమనం పొందవచ్చు. ఇది బెస్ట్ రెమిడీ అని చెప్పొచ్చు.

నీరు తాగండి:

నీరు తక్కువగా తాగడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. కాబట్టి నీరు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు, నీటిని తాగడం చాలా మంచిది. దీంతో త్వరగా మైగ్రేన్ నుంచి బయట పడతారు. అలాగే కాసేపు నిద్రించాలి. నిద్ర పోవడం వల్ల కూడా మైగ్రేన్ తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

మైగ్రేన్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు.. కొద్ది నిమిషాల్లో మాయం!
మైగ్రేన్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు.. కొద్ది నిమిషాల్లో మాయం!
భూమిక చావ్లా లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
భూమిక చావ్లా లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పైనుంచి దూకాడు.. కట్ చేస్తే..
దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పైనుంచి దూకాడు.. కట్ చేస్తే..
తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
రైలు అకస్మాత్తుగా రద్దయ్యిందా? టికెట్‌ ధరలో ఎంత రీఫండ్‌ చేస్తారు?
రైలు అకస్మాత్తుగా రద్దయ్యిందా? టికెట్‌ ధరలో ఎంత రీఫండ్‌ చేస్తారు?
పొడి దగ్గును త్వరగా తగ్గిపోవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్!
పొడి దగ్గును త్వరగా తగ్గిపోవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్!
జాగ్రత్త.. అగ్గి రవ్వే ఏం కాదులే అనుకుంటే.. మీరు కూడా ఇలానే..
జాగ్రత్త.. అగ్గి రవ్వే ఏం కాదులే అనుకుంటే.. మీరు కూడా ఇలానే..
రోజుకు రెండు యాలకులు తింటే బోలెడు లాభాలు
రోజుకు రెండు యాలకులు తింటే బోలెడు లాభాలు
వైద్యుల హెచ్చరిక! వాయుకాలుష్యంతో పెరుగుతున్న చర్మక్యాన్సర్ ముప్పు
వైద్యుల హెచ్చరిక! వాయుకాలుష్యంతో పెరుగుతున్న చర్మక్యాన్సర్ ముప్పు
దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు..
దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు..