Pushpa 2: ఇండియన్ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్ !!
ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు ఈ ఘనత దక్కలేదు. ఇండియాన్ సినిమా చరిత్రలోనే ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల రోజే ఈ సినిమా రికార్డులు సృష్టించనుంది.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్ లో పుష్ప: ది రూల్ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో 6,500.. ఓవర్సీస్లో 5000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప2 రికార్డు సృష్టించనుండడం ఖాయమేనని అంటున్నారు. ఈ సినిమా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
Mayonnaise: అమ్మో మయోనైజ్.. తింటే అంత డేంజరా ??
Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

