రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
మారుతున్న జీవనశైలిలో బరువు పెరగడం అనేది ఆరోగ్యరీత్యా క్లిష్ట సమస్యగా మారింది. అనేక రకాల వ్యాధులకు బరువు పెరగడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. దీంతో బరువు తగ్గించుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో రాత్రిపూట భోజనం మానేయడం కూడా ఒకటి.
రాత్రి పడుకోవడమే తప్ప చేసే పని ఏమీ ఉండదు కాబట్టి భోజనం చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారు. రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే రాత్రి భోజనం గురించి ఆహార నిపుణులు కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. రాత్రి ఆహారం మానేస్తే శరీరంలో శక్తి స్థాయిలు దారుణంగా పడిపోతాయి. మరుసటి రోజు ఉదయం లేవగానే చాలా నీరసంగా ఉంటారు. ఇది రోజంతా చేయవలసిన పనిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రాత్రి భోజనం మానేస్తే సరిగా నిద్రపోలేరని వైద్యులు అంటున్నారు. రాత్రి ఆకలివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల నిద్రకు ఆటంకం కూడా ఏర్పడుతుంది. రాత్రి పూట ఆహారం, నిద్ర సరిగా లేకపోవడం వల్ల మరుసటి రోజు బద్దకం, నీరసం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. రాత్రి ఆహారం తినకపోతే బరువు తగ్గడం అటుంచి, ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారని అంటున్నారు నిపుణులు. రాత్రంతా ఆహారం లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆహారం ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతే కాదు ఇది జీర్ణక్రియను నెమ్మదించడం వల్ల బరువు తగ్గే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో నిద్ర పోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ సేపు ఆకలితో ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ స్థాయి పెరిగి, ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mayonnaise: అమ్మో మయోనైజ్.. తింటే అంత డేంజరా ??
Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
Aha OTT: గుడ్ న్యూస్.. ఆహాలో త్వరలో చిరంజీవ