KA: కిరణ్ అబ్బవరం క మూవీ.. హిట్టా ?? ఫట్టా ??

KA: కిరణ్ అబ్బవరం “క” మూవీ.. హిట్టా ?? ఫట్టా ??

Phani CH

|

Updated on: Nov 01, 2024 | 10:33 AM

నిన్న మొన్నటి వరకు హిట్స్.. ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చేసిన ఫిల్మ్ 'క'. టైటిల్ అనౌన్స్‌ మెంట్ దగ్గర నుంచే.. టీజర్, ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసిన ఈ సినిమా దీపావళి కానుకగా.. తాజాగా రిలీజ్ అయింది.

మరి ఈ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరానికి క.. హిట్టిస్తుందా? లేదా..? తెలియాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే..! క కథ లోకి వెళితే.. అభినయ వాసుదేవ్ అలియాస్ కిరణ్ అబ్బవరం అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. కట్ చేస్తే.. పెద్దయ్యాక కొన్నాళ్లకు.. వాసు కృష్ణగిరి అనే ఊరికి వచ్చి అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు అలియాస్ అచ్యుత్ కుమార్ కూతురు సత్యభామ అలియాస్ నయన సారికతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు. అయితే ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ జీవితం సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? వాసుతో పాటు టీచర్‌ రాధ అలియాస్ తన్వి రామ్‌ను కిడ్నాప్ చేసి వేధించే ముసుగు వ్యక్తి ఎవరు? వీటన్నింటి మధ్యలో.. వాసుదేవ్ – సత్యభామల ప్రేమకథ ఏమైంది? అనేది మిగిలిన కథ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్