AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు లాభాల బాట పట్టారు. గత దీపావళి నుంచి.. ఈ ఏడాది దీపావళి వరకు లెక్క చూసుకుంటే ఏకంగా ఇన్వెస్టర్లు 1.5 ట్రిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..!

దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు
Stock MarketImage Credit source: Reuters/Francis Mascarenhas
Ravi Kiran
|

Updated on: Nov 01, 2024 | 12:53 PM

Share

ఏంటి.! టైటిల్ చూసి కొంచెం షాక్ అయ్యారా.. ఇది నిజమేనండీ.! గత దీపావళి నుంచి ఈ దివాళి వరకు దాదాపుగా పెట్టుబడిదారులకు 1.5 ట్రిలియన్ డాలర్లను ఆర్జించారు ఇన్వెస్టర్లు. గతేడాది దీపావళి(నవంబర్ 12) నుంచి దేశంలో పెట్టుబడిదారుల సంపద రూ. 128 లక్షల కోట్లు నుంచి రూ. 453 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ పరిస్థితులను తెలివిగా అంచనా వేయడం, బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలు, దేశీయ నిధుల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 4.7 లక్షల కోట్ల ఇన్‌ఫ్లోలు రావడంతో ఈ లాభాలు వచ్చాయట.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా మాట్లాడుతూ, ‘భౌగోళిక రాజకీయ అనిశ్చిత ఉన్నప్పటికీ, ఎన్నికలు.. ఆ తర్వాత నెలకొన్న మంచి పరిణామాలు. బలమైన స్థూల సూచికలు, పెట్టుబడిదారులను రక్షించడానికి సెబీ నిరంతర ప్రయత్నాలు వంటి నిర్ణయాలు బలమైన, ఆశాజనకమైన మార్కెట్ పర్యావరణ వ్యవస్థకు దోహదపడ్డాయి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇక గురువారం ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 20 కోట్లకు చేరుకుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ రంగంలో మొత్తం అసెట్ విలువ సుమారు రూ. 68 లక్షల కోట్లకు చేరింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా నెలవారీ ఇన్‌ఫ్లోస్ రూ. 25,000 కోట్ల మార్కుకు చేరువైంది. అటు బంగారం వార్షిక రాబడుల పరంగా రెండో స్థానానికి చేరుకోగా.. వెండి అగ్రస్థానంలో ఉంది. గడిచిన సంవత్సరంలో వెండి 37శాతం లాభంతో పోలిస్తే, బంగారం 33 శాతంగా ఉంది. బిట్‌కాయిన్ 72% రాబడితో ఇన్వెస్టర్లకు అధిక రాబడి తెచ్చిపెట్టింది. కాగా, మూడు రోజుల నుంచి స్టాక్ మార్కెట్‌లు నెగటివ్‌లో రన్ అవుతున్నాయి. మరి శుక్రవారం ముహూర్త ట్రేడింగ్‌లోనైనా.. పెట్టుబడిదారులు లాభాల బాట పడతారో లేదో చూడాలి.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..