Apple Big Exports: మేడిన్ భారత్.. ఐఫోన్ ఎగుమతుల్లో భారత్ హవా..ఆరు నెల్లలో రూ.50వేల కోట్లు..
యాపిల్ భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతులను పెంచింది. మునుపటి సంవత్సరం కంటే మూడింట ఒక వంతు పెంచింది. ఎందుకంటే యాపిల్ భారత్ దేశంలో తయారీని విస్తరించాలని, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తోంది.
సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు భారతదేశంలో తయారు చేసిన ఐఫోన్‌లను $6 బిలియన్ల (సుమారు రూ. 50,000 కోట్లు) ఎగుమతి చేసింది. ఇది FY24 నాటికి $10 బిలియన్లకు చేరుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించాడు. యాపిల్ రూ. 50,000 కోట్లను ఎగుమతి చేసిందని, గత ఆర్థిక సంవత్సరం నుండి 33% పెరుగుదల కనిపించిందని ఆయన ఎక్స్‌లో ట్విట్ చేశారు.
స్థానిక రాయితీలు, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ , సాంకేతిక పురోగతిని ఉపయోగించి యాపిల్ భారతదేశంలో ఐఫోన్ ఎగుమతులను విస్తరిస్తుంది. అమెరికా చైనా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌పై ఐఫోన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ తైవాన్, పెగాట్రాన్ కార్ప్. మరియు టాటా ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఇండియా ఈ తయారీ వృద్ధిని నడిపిస్తున్నాయి. ఫాక్స్‌కాన్ యొక్క చెన్నై యూనిట్ అతిపెద్ద సరఫరాదారు, ఇది భారతదేశం యొక్క ఐఫోన్ ఎగుమతుల్లో సగభాగాన్ని కలిగి ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్, గత సంవత్సరం విస్ట్రాన్ కార్పొరేషన్(Wistron Corp.) నుండి ఫ్యాక్టరీని కొనుగోలు చేసింది. యాపిల్ ఐఫోన్‌లు ఇప్పుడు భారతదేశం యొక్క స్మార్ట్‌ఫోన్ ఎగుమతులలో అతిపెద్ద భాగం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో USకు $2.88 బిలియన్‌లతో అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం, USకు వార్షిక స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు కేవలం $5.2 మిలియన్లు మాత్రమే..