AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు వెళ్లే రైలు అకస్మాత్తుగా రద్దు అయ్యిందా? టికెట్‌ ధరలో ఎంత రీఫండ్‌ చేస్తారు?

Indian Railways: సుదూర రైలు టిక్కెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించడం వలన, ప్రయాణికుల కోసం రిజర్వు సీట్లు ఉన్నాయి. ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, కనీస రద్దు ఛార్జీని రైల్వే శాఖ మినహాయించి రీఫండ్ చేస్తుంది. చలికాలంలో సుదూర రైలు ప్రయాణంలో పొగమంచు ఒకటి.

Indian Railways: మీరు వెళ్లే రైలు అకస్మాత్తుగా రద్దు అయ్యిందా? టికెట్‌ ధరలో ఎంత రీఫండ్‌ చేస్తారు?
Subhash Goud
|

Updated on: Nov 01, 2024 | 1:21 PM

Share

Indian Railways: పండుగల సీజన్ నడుస్తోంది. సుదూర రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నాయి. కొందరు పండగను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుంటారు. కొందరు దీర్ఘకాల సెలవులకు వెళుతుంటారు. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు సేవలందించేందుకు 3000 అదనపు రైళ్లను నడుపుతోంది. అయితే నవంబర్ నెల వచ్చేసరికి వాతావరణం కూడా మారిపోతోంది. పొగమంచు కారణంగా ప్రతి సంవత్సరం చాలా రైళ్లు ఆలస్యంగా లేదా రద్దు అవుతున్నాయి. మీ రైలు రద్దు అయితే లేదా చివరి నిమిషంలో మీరు మీ ప్రయాణ ప్రణాళికను మార్చినట్లయితే, టిక్కెట్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎంత డబ్బు తిరిగి వస్తుంది?

సుదూర రైలు టిక్కెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించడం వలన, ప్రయాణికుల కోసం రిజర్వు సీట్లు ఉన్నాయి. ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, కనీస రద్దు ఛార్జీని రైల్వే శాఖ మినహాయించి రీఫండ్ చేస్తుంది. చలికాలంలో సుదూర రైలు ప్రయాణంలో పొగమంచు ఒకటి. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. చాలా రైళ్లు, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి, రద్దు అయ్యాయి. లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో చాలామంది టిక్కెట్లు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, ప్రయాణికులు టిక్కెట్‌ను రద్దు చేసి రీఫండ్‌సు పొందవచ్చు. ఇందుకోసం టీడీఆర్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: LPG Cylinder: దీపావళి పండగ వేళ సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం RAC లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల నుండి రద్దు ఛార్జీలు వసూలు చేయడం లేదని భారతీయ రైల్వే తెలిపింది. కన్ఫర్మ్‌ టిక్కెట్‌లను రద్దు చేసిన సందర్భంలో మాత్రమే రద్దు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పుడు రైలు టికెట్ రద్దు చేసే సమయాన్ని బట్టి వాపసు మొత్తం కూడా మారుతుంది. అలాగే, టికెట్ రీఫండ్‌ మొత్తం రైలులోని ఫస్ట్‌ క్లాస్‌, AC చైర్ కార్ లేదా సెకండ్‌ క్లాస్‌ వంటి ప్రతి తరగతిపై ఆధారపడి ఉంటుంది.

రద్దు ఛార్జీలు:

భారతీయ రైల్వే కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల నుండి టిక్కెట్ రద్దు కోసం ఇప్పుడు రూ.60 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు రూ.120, థర్డ్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌ రద్దు చేయడానికి రూ.180, సెకండ్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌ రద్దు చేయడానికి రూ.200, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ టిక్కెట్‌ను రద్దు చేయడానికి రూ.240. ఇంతకుముందు, భారతీయ రైల్వేలు RAC టిక్కెట్లు లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల రద్దు కోసం సర్వీస్‌ ట్యాక్స్‌, ఇతర ఛార్జీలను విధించాయి. ఇప్పుడు ఆ డబ్బులో కోత లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు వెళ్లే ప్రాంతం, టికెట్‌ ధరను బట్టి ఛార్జీలు ఉంటాయన్న విషయం గుర్తించుకోండి.

వాపసు మొత్తం:

రైలు బయలుదేరడానికి 48 గంటల సమయంలో 12 గంటల కంటే తక్కువ సమయానికి ఒక ప్రయాణికుడు కన్ఫర్మ్‌ టిక్కెట్‌ను రద్దు చేస్తే, ఈ సందర్భంలో మొత్తం ఛార్జీలో 25% రద్దు రుసుము కట్‌ చేస్తారు. రైలు బయల్దేరే 12 గంటల సమయం ఉంటే 4 గంటలలోపు కన్ఫర్మ్ చేసిన టికెట్‌ను రద్దు చేస్తే, టికెట్ ధరలో 50 శాతం మినహాయించబడుతుంది.

ఇది కూడా చదవండి: Gold Buying: భారత్‌లో బంగారం కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి? చైనాను అధిగమించిన ఇండియా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి