TRAI: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నో టెన్షన్‌.. టెలికాం రంగంలో కొత్త రూల్స్‌!

TRAI: టెక్నాలజీ పెరిగినప్పటికీ ఆన్‌లైన్‌ మోసాలు భారీగా జరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు యూజర్లకు ఫోన్‌లు చేస్తూ వివరాలు రాబట్టి మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు..

TRAI: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నో టెన్షన్‌.. టెలికాం రంగంలో కొత్త రూల్స్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 01, 2024 | 11:29 AM

దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ దుండగులు రోజుకో కొత్త మార్గాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ మోసాలను అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తూ వాటిని వదిలించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశిస్తోంది. ఈ ప్రాసెస్‌ నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది.

స్కామర్లను నివారించడం సులభం:

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు స్కామర్‌లను నివారించడం సులభం అవుతుంది. నవంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు అమలులోకి రావచ్చు.

ఇది కూడా చదవండి: LPG Cylinder: దీపావళి పండగ వేళ సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర

ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్చిందని, ఫేక్ కాల్స్ ఆపాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. మోసగాళ్లు ఫేక్ కాల్స్, మెసేజ్ ల ద్వారా ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

కొత్త నిబంధనలు ఏమిటి?

కొత్త రూల్ ప్రకారం, ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను టెలికాం ఆపరేటర్లు ముందే స్క్రీనింగ్ చేస్తారు. ఈ నంబర్లలోని కొన్ని కీలకపదాలను గుర్తించడం ద్వారా ఆ సందేశాలు, కాల్‌లు వెంటనే బ్లాక్ చేసేస్టారు. ఇది కాకుండా సిమ్ కార్డ్ వినియోగదారులు ఫిర్యాదు చేసినా, ఆ సందేశాలు, కాల్ నంబర్లు బ్లాక్ చేస్తారు. మోసాన్ని అరికట్టడంలో సహాయపడే ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఇది కూడా చదవండి: TRAI: నవంబర్‌ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి