ChatGPT: ఓపెన్‌ ఏఐ మరో సంచలనం.. గూగుల్‌కు పోటీగా..

చాట్ జీపీటీ ఉపయోగిస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు చాట్ జీపీటీ కేవలం డేటా బేస్ లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మాత్రమే సమాచారం అందించేది. అయితే ఇప్పుడు గూగుల్ కు పోటీనిచ్చేలా కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నారు..

ChatGPT: ఓపెన్‌ ఏఐ మరో సంచలనం.. గూగుల్‌కు పోటీగా..
Chat Gpt
Follow us

|

Updated on: Nov 01, 2024 | 2:25 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మొదటిసారి ఏఐ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చింది మాత్రం చాట్‌జీపీటీ వల్లే అని చెప్పాలి. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ సెర్చ్‌ ఇంజన్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎలాంటి ప్రశ్న అడిగా వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ ప్రత్యేకత.

అయితే గూగుల్‌లో ఉన్న ఉన్నట్లు వెబ్‌ లింక్స్‌ మాత్రం చాట్‌ జీపీటీలో అందుబాటులో ఉండదు. కేవలం ఒకే సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఓపెన్‌ఐ కీలక నిర్ణయం తీసుకుంది. అచ్చంగా గూగుల్‌ మాదిరిగానే ఇకపై చాట్‌ జీపీటీలో కూడా వెబ్‌ లింక్స్‌ సజెక్ట్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా యూజర్లు ఇకపై తక్షణమే, వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్‌ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఇంతకుముందులా సెర్చ్‌ ఇంజిన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని పేర్కొంది.

ఇందుకోసం చాట్‌జీపీటీ హోమ్‌ పేజీలో కొత్తగా సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్‌ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. కేవలం డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని అందిచడానికి మాత్రమే పరిమితం కాకుండా.. రియల్‌ టైమ్‌ సమాచారాన్ని కూడా అందించనుంది.

చాట్‌జీపీటీ ప్లస్‌, టీమ్‌ యూజర్లు, సెర్చ్‌జీపీటీ వెయిట్‌ లిస్ట్‌ యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు.. ఎంటర్‌ప్రైజెస్‌, ఎడ్యుకేషనల్‌ యూజర్లు కొన్ని వారాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకున్నారు. కాగా చాట్‌ జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వారికి మాత్రం ఈ ఫీచర్‌ రావడానికి మరికొన్ని నెలలు సమయం పడుతుందని ఓపెన్‌ ఏఐ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..