డయాబెటిస్ రోగులు దొండకాయ్ తింటే ఏమవుతుందో తెల్సా.?

01 November 2024

Ravi Kiran

దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని చాలా మంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ కూరగాయ అంటే పెద్దగా ఎవరికీ నచ్చదు. 

కానీ దొండకాయతో కూడా ఎంతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. దొండకాయలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. దొండకాయ ఆకులు, వేరు, కాండంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది తింటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది.

ముఖ్యంగా షుగర్‌తో బాధ పడేవారు దొండకాయను తింటే ఎంత షుగర్ ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్‌‌ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ టాలరెన్స్‌ని సైతం తగ్గిస్తుంది. తరుచుగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరగవు. 

షుగర్ పేషెంట్స్ వారంలో రెండు, మూడు సార్లు తిన్నా చాలా మంచిది. అంతే కాకుండా అర్థ రైటిస్, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, ఆందోళన, కామెర్లు, పుండ్లు, చర్మ సమస్యలు దీనితో తగ్గుతాయి. 

అలాగే కడుపులో ఉండే పురుగలు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో దొండ కాయలు అద్భుతంగా పని చేస్తాయి. 

ఈ అంశాలు కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ప్రచురితం చేసినవి. మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.