AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇద్దరి మధ్య జాతి వైరమున్నా.. స్నేహ ధర్మాన్ని చాటుతున్న మూగజీవాలు..!

అశ్వారావుపేటలో ఒక కుక్క- కోతి తమ శత్రుత్వాలు మరిచి ఎంతో స్నేహంగా ఉండటం చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Watch Video: ఇద్దరి మధ్య జాతి వైరమున్నా.. స్నేహ ధర్మాన్ని చాటుతున్న మూగజీవాలు..!
Dog Monkey Friendship
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 01, 2024 | 12:12 PM

Share

ఒకరు గ్రామ సింహం.. మరొకరు అంజన్న ప్రతిరూపం. ఈ ఇద్దరూ ఎక్కడ ఎలా ఎదురుపడ్డా.. ఆ గొడవ మాములుగా ఉండదు. అయినా సరే ఆ ఇద్దరి స్నేహం.. చూసి ఒక్కొక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. స్నేహమంటే మాదేనంటున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా కుదిరిందో కానీ ఈ ఫ్రెండ్‌షిప్.. అలా ఒకరిపై మరొకరెక్కి ఎంచక్కా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య జాతి వైరమున్నా సరే.. దాన్ని కాదని ఈ రెండు మూగజీవులు.. తమకు తోచిన స్నేహ ధర్మాన్ని చాటుతున్నారు.

రోజు రోజుకీ మనుషుల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయి, కానీ ఒకప్పుడు మూగ జీవాల మధ్య ఈ ద్వేషాలు శత్రుత్వాలు ఉండేవి మనకందరికీ తెలుసు, కోతి తన జాతి కానీ మిగతా జంతువులతో ఎలా స్నేహంగా ఉంటుందో ఈ వీడియో చూడండి..

రెండూ రెండే.. కుక్క- కోతి కనిపించగానే దాన్ని తరిమి తరిమి కొట్టాలని చూస్తుంది. అదే కోతి.. కుక్కను ఉడికించి ఉడికించి వేధిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం.. మా మధ్య మాత్రం ఎలాంటి పొరపచ్చాలు లేవబ్బా.. మేం అవడానికి కోతీ- కుక్క అయ్యామేమోగానీ.. మేమిద్దరం ఒకటే.. సోల్ మేట్స్.. అంటూ.. హల్ చల్ చేస్తున్నాయి..

పాము-ముంగిస, కోడి-కుక్క,కోతి-కుక్క ఇంకా అనేక జంతువుల మధ్య ద్వేషం ఉంటుంది, కానీ అశ్వారావుపేటలో ఒక కుక్క- కోతి తమ శత్రుత్వాలు మరిచి ఎంతో స్నేహంగా ఉండటం చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా మనుషులు కూడా స్నేహంగా ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లోని గెస్ట్ హౌస్ బజారులో కుక్క -కోతి ఎంతో స్నేహంగా ఉంటూ, సరదాగా ఆడుకొంటున్నాయి. కుక్క కోతి ఒళ్ళో తల పెట్టుకొంటే కోతి కుక్క శరీరంలోని పేలు తీస్తూ, రెండు దాగుడు మూతలు అడుకొంటున్నాయి. అటువైవు స్థానికులు తిరుగుతున్న ఎవరిని పట్టించుకోకుండా ,ఆ రెండు ఆప్యాయంగా ఆనందంగా గడుపుతున్నాయి.

అశ్వారావుపేట పట్టణంలో గత కొద్ది నెలలుగా కోతుల గుంపు సంచారం పెరిగిపోయింది. ఈ కోతుల సమూహం పట్టణమంతా తిరిగి మధ్యాహ్నం గెస్ట్ హౌస్ బజారుకు చేరుతున్నాయి. ఈ సమూహంలోని ఒక కోతికి ఇక్కడ ఉంటున్న కుక్కతో స్నేహం ఏర్పడింది. ఈ కుక్క ఆ కోతి వచ్చే సమయానికి అక్కడకు చేరుకుంటుంది. ఇక రెండు కలిసి చేసే హడావుడి మాములుగా ఉండదు. దాగుడు మూతలు, పేలు చూడడం, కుక్క పైకి ఎక్కి కోతి విన్యాసాలు చేయడం, సరదాగా ఆదుకోవడం బజారులోని రోడ్డు తమదే అన్నట్లు వ్యవహారిస్తాయి.

అటువైపు,ఇటువైపు వెళ్లే పాదచారులు, చుట్టు పక్కన నివసించే స్థానికులు వీటి విన్యాసాన్ని ఎంతో తీక్షణంగా వీక్షిస్తుంటారు. ఈ దృశ్యాలు చూసిన స్థానిక ప్రజలు నివ్వెరపోతూ, ఇప్పటి కాలం ప్రజలు వీటిని చూసి అయిన మారాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల మధ్య ఐక్యత , స్నేహాన్ని అభినందించాల్సిందే!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..