ఆరోగ్య చిక్కులకు చక్కని చిక్కుడు.. మీరు తింటున్నారా?

01 November 2024

TV9 Telugu

TV9 Telugu

చాలామంది చిక్కుడు పేరు వినగానే ముఖం చిట్లిస్తుంటారు. నిజానికి, వీటిలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. తోలు, గింజ అని తేడా లేకుండా రెండింటిలోనూ పోషకాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

వంద గ్రాముల చిక్కుడు కాయల్లో దాదాపు మూడు వంతులకు పైగా నీరే ఉంటుంది. వీటి నుంచి 24 కెలొరీల శక్తి లభిస్తుంది. 4 గ్రా, మాంసకృత్తులు, 2 గ్రా., పిండిపదార్థాలు,  పీచు 9 గ్రా ఉంటాయి

TV9 Telugu

చిక్కుడు కాయల్లో కొవ్వు అస్సలు ఉండదు. క్యాల్షియం 64 మి.గ్రా., ఫోలిక్‌ ఆమ్లం 20-40 మై.గ్రా., ఉంటాయి. వీటితోపాటు మెగ్నీషియం, మాంగనీస్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

నిజానికి, ఈ గ్రీన్ వెజిటేబుల్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. చలికాలం ప్రారంభంలో ఈ కూరగాయ మార్కెట్‌లోకి అధికంగా వస్తాయి. చిక్కుడులో విటమిన్ బి6, సి, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి

TV9 Telugu

చిక్కుడులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ బీన్స్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంతోపాటు పేగు క్యాన్సర్లు రాకుండా చూస్తుంది

TV9 Telugu

వీటిల్లోని ఫైబర్, మోనోశాచురేటెడ్ ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో తీసుకుంటే బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. చిక్కుడులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది

TV9 Telugu

చిక్కుడలో మెగ్నీషియం ఉంటుంది. ఇది నిద్రలేమిని నయం చేయడంలో సహాయపడుతుంది. అలసటను కూడా తొలగించి, శక్తిని ఇస్తుంది. వీటి ఈ గింజల్లో అధికంగా ఉండే ఎల్‌- డోపమైన్‌ అనే రసాయనం పార్కిన్‌సన్స్‌ను రాకుండా అడ్డుకుంటుంది

TV9 Telugu

చిక్కుడు కాయలోని కొన్ని రసాయనాలు సంతోష హార్మోన్‌ విడుదలకు తోడ్పడతాయి. కాబట్టి ఒత్తిడిగా, ఆందోళనగా ఉన్నప్పుడు ఈ కూర తిని చూడండి. ఒత్తిడి పరార్‌ అవుతుంది