AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పైనుంచి దూకాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ.. మూఢ నమ్మకాలపై పిచ్చిగా నమ్మకం ఉంచిన ఓ యువకుడు చేయకూడదని పని చేశాడు. ఈ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

Viral: దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పైనుంచి దూకాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్
Viral
Ravi Kiran
|

Updated on: Nov 01, 2024 | 1:35 PM

Share

తమిళనాడులో దారుణం జరిగింది. సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ.. మూఢ నమ్మకాలపై పిచ్చిగా నమ్మకం ఉంచిన ఓ యువకుడు చేయకూడదని పని చేశాడు. దేవుడు తనను బ్రతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో.. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు ఓ 19 ఏళ్ల యువకుడు. కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఏం జరిగింది.. అసలేమైందో ఇప్పుడు చూద్దాం..

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

వివరాల్లోకి వెళ్తే.. పెరుందురైలోని మెక్కూర్ గ్రామానికి చెందిన ప్రభు అనే యువకుడు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైన అతడు.. దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అక్టోబర్ 28న సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన జరిగింది. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, దేవునితో తాను మాట్లాడానని.. తాను చనిపోయినా.. బతుకుతానన్న పిచ్చి నమ్మకంతో కాలేజీ నాలుగో అంతస్తు నుండి ప్రభు దూకేసినట్టు అతడి ఫ్రెండ్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

బిల్డింగ్‌పై నుంచి దిగాలని తోటి విద్యార్ధులు కోరినా.. అతడు వినిపించుకోలేదట. అతడిపై ఎవరో చేతబడి చేశారని ప్రభు ఫ్రెండ్స్ అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో ప్రభుకు చేతులు, కాళ్లు విరిగాయి. తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం యువకుడు తమిళనాడులో కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి