Diwali Celebration: రిక్షావాలా దీపావళి సెలబ్రేషన్ మాములుగా లేవుగా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ఓ రిక్షావాలా తనకు ఉన్నంతలో దీపావళి పండుగను జరుపుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అతడు తన రిక్షాను కొవ్వొత్తులతో నింపి అందంగా అలంకరించుకున్నాడు. దీపావళి విజయ కాంతులు తన జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Diwali Celebration: రిక్షావాలా దీపావళి సెలబ్రేషన్ మాములుగా లేవుగా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
rickshaw puller lights candles on his rickshaw
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2024 | 4:18 PM

దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లు, భవనాలు, దుకాణాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. చాలా మంది తమ ఇళ్ల ముందు మట్టి ప్రమిదలు కూడా వెలిగించుకున్నారు. ఢిల్లీ మినహా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే, దీపావళి వేడుకల్లో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఓ రిక్షావాలా జరుపుకున్న దీపావళి వేడుకలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో అతడి ఫోటోలు, వీడియోలు విపరీతంగా షేర్‌ అవుతూ, ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ దృశ్యం దేశ రాజధాని ఢిల్లీలో దర్శనమిచ్చింది.

Rickshaw Puller

ఢిల్లీలో ఓ రిక్షావాలా తనకు ఉన్నంతలో దీపావళి పండుగను జరుపుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అతడు తన రిక్షాను కొవ్వొత్తులతో నింపి అందంగా అలంకరించుకున్నాడు. దీపావళి విజయ కాంతులు తన జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Rickshaw Puller

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు అతన్ని ఎంతగానో అభినందిస్తున్నారు. చాలా మంది అతని ఫోటోలకు లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.