Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి పెళ్లికాని వారు ఇక్కడ దీపాలు వెలిగిస్తే.. ఇక షాదీ పక్కా.! ఎక్కడంటే..

ఇక్కడికి వచ్చేవారు తమ కోరికలను లేఖలో రాసి బాబాకు సమర్పించినట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని చెబుతారు. పెళ్లికాని అబ్బాయి, అమ్మాయి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం కూడా ఉంది.

దీపావళికి పెళ్లికాని వారు ఇక్కడ దీపాలు వెలిగిస్తే.. ఇక షాదీ పక్కా.! ఎక్కడంటే..
Ajmer Khobra Bhairavnath
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2024 | 3:54 PM

దీపావళి అంటేనే దీపాల వరుస.. వెలుగుల పండుగ దీపావళిని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందోహత్సాల నడుమ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అయితే, మన దేశంలో ఒక్కో పండగను పురస్కరించుకుని ఒక్కో దేవాలయం, దేవుడికి ప్రముఖ్యత ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన దేవాలయం ఒకటి ఉంది. ఇది బ్రహ్మచారులకు అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. దీపావళి రోజున ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తే త్వరగా వారికి వివాహ జరుగుతుందని ప్రజల్లో విశ్వాసం. ఈ వింత ఆలయం ఎక్కడుంది.. ఆ కథేంటో తెలుసుకుందాం..

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని అనసాగర్‌లో ఉన్న ఖోబ్రనాథ్ భైరవ్ ఆలయం. ఇది రాంప్రసాద్ ఘాట్ పైన ఉన్న కొండపై నిర్మించబడి ఉంటుంది. దీనిని షాదీ దేవ్ అని కూడా అంటారు. ఇక్కడ మొక్కులు చెల్లించిన వారికి కోరిక తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. వారంలో ప్రతినిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదివారం మాత్రం దర్శనానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారు తమ కోరికలను లేఖలో రాసి బాబాకు సమర్పించినట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని చెబుతారు. పెళ్లికాని అబ్బాయి, అమ్మాయి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం కూడా ఉంది.

కాగా, దీపావళి పండుగ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. కాయస్థ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారని ఆలయ పూజారి చెప్పారు. ఏడాది పొడవునా ఈ జాతర పట్ల యువతలో ఉత్కంఠ నెలకొంది. దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆలయాన్ని చౌహాన్ వంశానికి చెందిన రాజు అజయ్ పాల్ నిర్మించారు. తరువాత, మరాఠాలు పాలనలోకి వచ్చినప్పుడు, వారి ద్వారా ఈ ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరిగాయి. ఈ ప్రదేశాన్ని శివుని ద్వారపాలకుడిగా భావిస్తారని ఆలయ పూజారులు చెబుతున్నారు. దీన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా వస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..