పండగక్కి ఇళ్లంతా శుభ్రం చేశారు.. లక్షలు విలువ చేసే బంగారం చెత్తలో విసిరేశారు..! తీరా తెలిసి లబోదిబోమంటూ..

ఇంటి క్లీనింగ్‌లో ఎవరైనా తమ విలువైన నగలను కూడా చెత్తతో పాటు విసిరేశారనే వార్తను మీరు ఎప్పుడైనా విన్నారా..? కానీ, నిజంగానే ఓ కుటుంబం ఇదే పని చేసింది. ఇంట్లోని ఖరీదైన ఆభరణాలను ఓ కుటుంబం చెత్తబుట్టలో పడేసింది. ఆ తరువాత గ్రహించి లబోదిబోమనాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన

పండగక్కి ఇళ్లంతా శుభ్రం చేశారు.. లక్షలు విలువ చేసే బంగారం చెత్తలో విసిరేశారు..! తీరా తెలిసి లబోదిబోమంటూ..
Family Threw Gold Jewelery
Follow us

|

Updated on: Oct 31, 2024 | 3:18 PM

దీపావళి.. పండగక్కి నెల రోజుల ముందు నుంచే ప్రజలు తమ ఇళ్లు, ఆఫీసులు, కార్యాలయాలను శుభ్రం చేసుకుంటారు. ఎక్కడా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి దూరంగా పడవేస్తుంటారు. అయితే, ఈ క్లీనింగ్‌లో ఎవరైనా తమ విలువైన నగలను కూడా చెత్తతో పాటు విసిరేశారనే వార్తను మీరు ఎప్పుడైనా విన్నారా..? కానీ, నిజంగానే ఓ కుటుంబం ఇదే పని చేసింది. ఇంట్లోని ఖరీదైన ఆభరణాలను ఓ కుటుంబం చెత్తబుట్టలో పడేసింది. ఆ తరువాత గ్రహించి లబోదిబోమనాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

భిల్వారా నగరానికి చెందిన చిరాగ్ శర్మ కుటుంబ సభ్యులు దీపావళి పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోని ఒక ప్రత్యేక స్థలంలో దాచి ఉంచిన విలువైన ఆభరణాలు కూడా చెత్తతో పాటుగానే పారేశారు. కొంత సేపటి తర్వాత ఆ నగలను కూడా చెత్తలో వేశామని గ్రహించారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సంపద్రించారు. మేయర్ రాకేష్ పాఠక్‌కు సమాచారం అందించారు. ఎలాగైన తమ బంగారం వెతికించాలని వేడుకున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆభరణాలను గుర్తించారు. ఆ బంగారాన్ని కుటుంబసభ్యులు పొరపాటున చెత్త కుండీలో పడేశారని మేయర్ రాకేష్ పాఠక్ మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బందికి వివరించారు. వార్డు నంబర్ 27లోని చెత్త వ్యాన్ డ్రైవర్‌కు కాల్‌ చేశారు. బాధితుల ఆధ్వర్యంలోనే ఆ బండిలోని చెత్తను ఖాళీ చేయించారు. వారి అదృష్టం బాగుంది..పండగ పూట పోయిందనుకున్న బంగారం తిరిగి దొరికింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..