వీటిని తేలిగ్గా తీసుకోకండి.. మితంగా తింటేనే ఆరోగ్యం! లేదంటే డేంజరే..
01 November 2024
TV9 Telugu
TV9 Telugu
పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చే ఆహారం ఖర్జూరపండ్లు. ఇవి రుచిగా ఉండటమే కాదు బలాన్నిస్తాయి. అంతకుమించి తేలిగ్గా జీర్ణమవుతాయి
TV9 Telugu
బి-6, సి విటమిన్లు పీచు, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫొలేట్, మాంగనీస్, ఐరన్‌లతో ఖర్జూరం పోషకాల ఖజానా. ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది
TV9 Telugu
ఖర్జూరం రక్తంలో తెల్లరక్త కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రోగాల బారి నుంచి కాపాడతాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి
TV9 Telugu
హృద్రోగాలను నివారిస్తాయి. ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలను నివారించి దృఢంగా ఉంచుతాయి. రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లను సైతం నిరోధిస్తాయి
TV9 Telugu
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనివ్వక ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది
TV9 Telugu
ఇవెంత తియ్యగా ఉన్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వవు. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినడం వల్ల తక్షణం శక్తి వస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది
TV9 Telugu
అయితే రోజుకి ఎన్ని ఖర్జూరాలు తినాలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా డయేరియాతో బాధపడేవారు ఖర్జూరం తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. మలబద్ధకంతో బాధపడేవారు ఖర్జూరం తినకూడదు. నిపుణుల ప్రకారం రోజుకు 2 ఖర్జూరాలు తినాలి. బరువు పెరగడానికి అయితే రోజుకు 4 ఖర్జూరాలు తినవచ్చు