వైద్యుల హెచ్చరిక! వాయు కాలుష్యంతో పెరుగుతున్న చర్మ క్యాన్సర్ ముప్పు.. ముందే జాగ్రత్త పడదాం

దీపావళి పుణ్యమాని వాతావరణ కాలుష్యం మరింత పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. అయితే ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే మనందరికీ చర్మ కాన్యర్ రావడం ఖాయం.. అవును ఇప్పుడు ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యులు..

వైద్యుల హెచ్చరిక! వాయు కాలుష్యంతో పెరుగుతున్న చర్మ క్యాన్సర్ ముప్పు.. ముందే జాగ్రత్త పడదాం
Skin Cancer
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 01, 2024 | 12:57 PM

మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాలుష్యం తారా స్థాయికి చేరుకుంది. అలాంటి సమయాల్లో గాలిలోని అత్యంత ప్రమాదకరమైన చిన్న కణాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. దగ్గు, తలనొప్పి, కంటి చికాకు, అలసట వంటి లక్షణాలు జనాల్లో కనిపిస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే కాలుష్యం కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదో ఒక రోజు మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోన్నా ఆశ్చర్య పడవసరం లేదు. విషపూరితమైన గాలిని పీల్చడం రోజుకు 12 సిగరెట్లకు సమానం. ఇది మీ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.

కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలుష్యం మీ ఊపిరితిత్తులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. రాబోయే రోజుల్లో చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కలుషిత గాలిలో అనేక రకాల హానికరమైన కణాలు ఉంటాయి. అవి చర్మానికి చాలా హాని కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు. చర్మం, కళ్ళు, శ్వాస ద్వారా ఇవి శరీరం లోపలికి ప్రవేశించడం ద్వారా మన శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈరోజు ఇప్పిటికిప్పుడు దాని ప్రభావాలు మీకు తెలియకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా అవి మన శరీరంలో చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. అంత సులభంగా వదిలిపోవు.

చర్మంపై కాలుష్యం ప్రభావాలు

పొల్యూషన్ వల్ల చర్మం పాడైపోతోందని, అందువల్ల ఎక్కువగా బయట తిరిగేవాళ్లు తమ వయసు కంటే పెద్దవాళ్లలా కనిపిస్తారని వైద్యులు చెబుతున్నారు. అదనంగా చర్మంపై అదనపు పిగ్మెంటేషన్, ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీంతో చర్మం పొడిబారడంతోపాటు పగుళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

  • మీ చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడుకోవాలంటే ముందుగా మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. కొబ్బరి నూనె, మంచి మాయిశ్చరైజర్ క్రీమ్‌లను చర్మానికి రెగ్యులర్ గా వినియోగించాలి.
  • స్నానం చేసేటప్పుడు చాలా వేడి నీటిని ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది.
  • చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.
  • బయటకు వెళ్లేటప్పుడు, వీలైనంత వరకు మీ చర్మాన్ని కప్పి ఉంచాలి.
  • రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్‌కు వెళ్లవద్దు.
  • ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.
  • లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.