- Telugu News Photo Gallery These tips are the best to get rid of dry cough quickly, Check Here is Details
Dry Cough Remedies: పొడి దగ్గును త్వరగా తగ్గిపోవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్!
పొడి దగ్గు ఒక్కసారి వచ్చిందంటే.. త్వరగా తగ్గదు. ట్యాబ్లెట్స్, టానిక్స్ తాగినా కూడా పొడి దగ్గు తగ్గదు. వాటితో పాటు ఈ ఇంటి చిట్కాలు కూడా ట్రై చేస్తే చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. మీ కిచెన్‌లో, మీకు ఈజీగా దొరికే పదార్థాలతోనే పొడి దగ్గును తగ్గించుకోవచ్చు..
Updated on: Nov 01, 2024 | 1:19 PM

చలికాలంలో వేధించే సమస్యల్లో పొడి దగ్గు కూడా వస్తుంది. పొడి దగ్గు వచ్చిందంటే ఒక పట్టాన అస్సలు తగ్గదు. చికిత్స తీసుకున్నా.. పొడి దగ్గు నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. పొడి దగ్గు కారణంగా బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ హోమ్ రెమిడీస్‌తో చక్కగా పరిష్కరించుకోవచ్చు.

ఉప్పు - అల్లంతో కూడా పొడి దగ్గును కంట్రోల్ చేయవచ్చు. అల్లంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు పొడి దగ్గును తగ్గించేందుకు ట్రై చేస్తాయి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి.. దానిపై ఉప్పు చల్లి, తేనే కలపాలి. ఈ ముక్కలను నోట్లు ఉంచి చప్పరిస్తూ ఉండాలి.

పసుపు - మిరియాల కాంబినేషన్ కూడా పొడి దగ్గును తగ్గిస్తుంది. మిరియాల పొడిలో కొద్దిగా పసుపు కలిపి గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే త్వరగా ఉపశమనం పొందుతారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గును త్వరగా తగ్గిస్తాయి.

ఉప్పు నీటితో పొడి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. ఉప్పు నీటిని గొంతు దగ్గర పెట్టుకుని పుక్కిలిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

అదే విధంగా మిరియాల పొడితో కూడా పొడి దగ్గుకు బైబై చెప్పొచ్చు. నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తీసుకోవాలి. ఇలా ఉదయం, రాత్రి తీసుకుంటే పొడి దగ్గు నెమ్మదిగా కంట్రోల్ అవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




