AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జాగ్రత్త.. అగ్గి రవ్వే ఏం కాదులే అనుకుంటే.. మీరు కూడా ఇలానే..

దీపావళి పండుగ పూట ఎక్కడ చూసిన అగ్నిప్రమాదాలే దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ కొందరీకి విషాదాన్ని మిగిల్చింది. వ్యాపారులకు ఎంతో ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో బట్టల షాపు దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

Telangana: జాగ్రత్త.. అగ్గి రవ్వే ఏం కాదులే అనుకుంటే.. మీరు కూడా ఇలానే..
Fire Accident In Jagitiyal
Velpula Bharath Rao
|

Updated on: Nov 01, 2024 | 1:15 PM

Share

జగిత్యాల టవర్ సర్కిల్‌లోని సార్గమ్మ వీధిలో అమ్మాజీ డ్రెస్సెస్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం బందు చేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దుకాణం నుంచి మంటలు ఎగిసిపడటం చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్క దుకాణాలకు వ్యాపించకుండా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియల్సి ఉంది. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిలినట్లు దుకాణదారుడు తెలిపారు. పక్క దుకాణదారులు బాణాసంచ కాల్చడంతో షట్టర్ కింది నుంచి అగ్గి రవ్వలు పడి ప్రమాదం జరిగిందని దుకాణదారుడు ఆరోపిస్తున్నాడు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us