Tamannaah: తమన్నా కాళ్లు పట్టుకోవడానికి కూడా రెడీ.. నటుడి షాకింగ్ కామెంట్స్
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది.

తమన్నా ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకుంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరి హీరోలతో జత కట్టింది. అలాగే చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పించిన తమన్నా కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పిస్తుంది.
ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
ప్రస్తుతం తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో చివరిగా ఓదెల 2 అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో తెలుగులో సినిమాలు తగ్గించేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ సినిమాలు, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఓ నటుడు తమన్నా కాళ్లు పెట్టుకుంటా అని చెప్పి షాక్ ఇచ్చాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్.
ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..
అన్నూ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తమన్నా స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్త్రీ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. తమన్నా చాలా తెల్లగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దాంతో తమన్నా ఫ్యాన్స్ అన్నూ కపూర్ పై సీరియస్ అవుతున్నారు. ఒక అమ్మాయి అందాన్ని రంగుతో పోల్చుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. అన్నూ కపూర్ టార్గెట్ చేసి ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాంతో ఈ వివాదం పై అన్నూ కపూర్ స్పందిస్తూ.. హిందీలో అనడం వల్లే నేనన్న మాట వాళ్లకి వల్గర్‌గా అనిపించిందని, ఒకరి అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదని, క్రైమ్ అంతకన్నా కాదని, తన మనసులో అసలు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేదని తెలిపారు. అలాగే తన మాటలు తమన్నాకు బాధకలిగించి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: ఆమెకు రోజుకు 50సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడ్ని.. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది
View this post on Instagram




