ఆయన లేకపోతే నేను లేను.. నన్ను సినిమాల్లో తీసుకొచ్చింది ఆ మహానుభావుడే
తెలుగు సినీ, టీవీ నటుడు గుండు హనుమంతరావు తన సుదీర్ఘ ప్రస్థానాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.సినిమాలతో పాటు, అమృతం సీరియల్ తో అపారమైన ప్రజాదరణ పొందారు. మూడు నంది అవార్డులు అందుకున్న హనుమంతరావు గారు, తన వృత్తి జీవితంలోని ముఖ్య ఘట్టాలను, సవాళ్లను పంచుకున్నారు.

సినీ, టీవీ కెరీర్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు గుండు హనుమంతరావు. కమెడియన్ గా ప్రేక్షకులకు నవ్వులు పంచారు ఆయన. ఎన్నో సినిమాలో వివిధ పాత్రలు చేసి మెప్పించారు. అలాగే అమృతం లాంటి సీరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఆయన. అనారోగ్య సమస్యలతో గుండు హనుమంతరావు కన్నుముశారు. ఆయనను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తలుచుకుంటూనే ఉంటారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన ఇంటిపేరైన గుండుతోనే అందరికీ తాను బాగా గుర్తుండిపోయానని ఆయన తెలిపారు. హనుమంతరావు సినీ ప్రస్థానం 1974లో నాటకాలతో ప్రారంభమైంది. స్కూల్ రోజుల్లో నాటకాలు వేయకపోయినా, తండ్రి వ్యాపారంలో సహాయపడిన తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించారు. మద్రాసులో ఆయన ప్రదర్శించిన నాటకాన్ని చూసిన దర్శకుడు జంధ్యాల గారు ఆయన నటనా నైపుణ్యాన్ని గుర్తించి, సినిమాల్లో అవకాశం ఇస్తానని మాటిచ్చారు.
ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది
ఆ సమయానికి తనకు సినిమా ఆలోచనే లేదని, కేవలం నాటకాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనే తపన ఉండేదని ఆయన చెప్పారు. జంధ్యాల గారి ప్రోత్సాహంతో “ఆహా నా పెళ్ళంట” చిత్రంలో చెవిటి వేషం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మూడు సీన్ల ఆ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలకు షటిల్ చేస్తూ సినిమాలు, సీరియల్స్ తో సహా దాదాపు యాభై అవకాశాలు అందుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన “రాజేంద్రుడు గజేంద్రుడు”, “మాయలోడు”, “యమలీల” వంటి విజయవంతమైన చిత్రాలు ఆయనకు అపారమైన పాపులారిటీని తెచ్చాయి. సినిమాల మధ్య విరామం వచ్చినప్పుడు టీవీ సీరియల్స్ లో నటించడానికి అవకాశం వచ్చింది. జెమిని టీవీలో ప్రసారమైన “అమృతం” సీరియల్ ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆరేళ్లపాటు విజయవంతంగా నడిచిన ఈ సీరియల్ “క్లాస్ అండ్ మాస్” ప్రేక్షకులను అలరించి, ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
“అమృతం” షూటింగ్ డేట్లు సినిమాల డేట్లతో క్లాష్ అవ్వడం వల్ల ఆ సమయంలో చాలా మంచి సినిమా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక వారం పాటు ఐదు రోజులు, నెలకు ఎనిమిది రోజుల పాటు “అమృతం” షూటింగ్ జరిగేదని, స్క్రిప్ట్ ముందే సిద్ధంగా ఉండేది కాదని, దీనివల్ల కొన్ని అవకాశాలు చేజారిపోయాయని వివరించారు. హనుమంతరావు నటనా ప్రతిభకు గుర్తింపుగా మూడు ప్రతిష్టాత్మక నంది అవార్డులు లభించాయి. ఈటీవీలో ప్రసారమైన కే వాసు దర్శకత్వంలోని “బ్రహ్మేశియా” సీరియల్ లోని పాత్రకు ఒక నంది అవార్డు వచ్చింది. జెమిని టీవీ “అమృతం” సీరియల్ కు రెండవ నంది అవార్డు, ఈటీవీలో శివాజీరాజా నిర్మించిన “శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం” సీరియల్ లోని పిసినారి పాత్రకు మూడవ నంది అవార్డు లభించాయి.




