AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు విడాకులు అనేవి చాలా కామన్.. చాలా మంది సెలబ్రెటీలు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. అలాగే కొంతమంది లవ్ ఎఫైర్స్ ద్వారా వార్తల్లో ఎక్కువగా నిలిచారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో కూడా అదే కోవా లోకి వస్తాడు.

ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2026 | 9:53 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తిరుగులేని హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినీ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు.. సినీ కెరీర్ లో సూపర్ స్టార్ అయిన వ్యక్తిగత జీవితం కూడా ఎక్కువగానే వార్తల్లో నిలిచాయి. ఇద్దరితో వివాహం ఒకరితో రిలేషన్ తో వార్తల్లో నిలిచాడు ఆ హీరో ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు కమల్ హాసన్. జాతీయ నటుడు కమల్ హాసన్ వెండితెరపై తిరుగులేని నటుడు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఆయన ప్రేమ వ్యవహారాలు, వివాహాలు, విడాకులు ఎప్పుడూ పెద్ద చర్చే.. తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో, కమల్ హాసన్ నటి శ్రీవిద్యతో ప్రేమలో పడ్డారు. 1970లలో సినీ రంగంలో కొత్తగా ప్రవేశిస్తున్న సమయంలో వారిద్దరూ ప్రేమ బంధాన్ని పంచుకున్నారు. అయితే, శ్రీవిద్య పెళ్లి చేసుకోవాలని కోరగా, కమల్ కెరీర్ దృష్ట్యా ఆలస్యం చేయాలనుకున్నారు. ఈ అభిప్రాయభేదాలు వారి విడిపోవడానికి దారితీశాయి. శ్రీవిద్య తన బ్రేకప్ వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి :  Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

ఆమెను కమల్ కుటుంబ సభ్యురాలిగా భావించినా, వారి ప్రేమ బంధం ఊహించని విధంగా ముగిసింది. శ్రీవిద్యతో విడిపోయిన తర్వాత, కమల్ హాసన్ 1978లో ప్రముఖ భరతనాట్య కళాకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన వీరు, 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కలిసి నటించారు. వివాహానికి ముందు వాణి లివింగ్ రిలేషన్‌లో ఉండటానికి ఇష్టపడకపోవడంతో, సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వాణి కమల్ హాసన్ నటించిన అనేక సినిమాలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. అయితే, వారి వివాహ బంధం పదేళ్లకు మించి కొనసాగలేదు. విభేదాల కారణంగా 1988లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత చాలా సంవత్సరాలకు, 2015లో కమల్ హాసన్ ఒక సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. వాణి గణపతికి భరణం చెల్లింపుల కారణంగా తాను ఆర్థికంగా కుప్పకూలిపోయానని, దాదాపు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కమల్ హాసన్ వ్యాఖ్యలపై వాణి గణపతి చాలా సంవత్సరాలు మౌనంగా ఉన్నప్పటికీ, తర్వాత తీవ్రంగా స్పందించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కమల్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. “మేము విడిపోయి 28 సంవత్సరాలు అయ్యింది. ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల చాలా సంవత్సరాలు మౌనంగా ఉన్నాము. మేమిద్దరం మా జీవితాల్లో ముందుకు సాగాము. అతను ఇంకా ఆ పాత విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?” అని ఆమె ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..

విడాకుల సమయంలో కమల్ పాత ఇంటి వస్తువులను కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదని, తాను సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు అది బహుశా అతని అహాన్ని దెబ్బతీసి ఉండవచ్చని వాణి పేర్కొన్నారు. అయితే, అప్పటినుంచి చాలా జరిగిందని, ఆర్థిక ఇబ్బందులకు తాను బాధ్యత వహించనని ఆమె స్పష్టం చేశారు. కమల్ మోసం చేయడంలో నిపుణుడని, నవ్వుతూ తన మాటలను ఉపయోగించి ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సులభంగా ఎలా బయటపడాలో అతనికి తెలుసని వాణి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వాణితో విడిపోయిన తర్వాత, కమల్ హాసన్ నటి సారికతో సంబంధాన్ని ప్రారంభించారు. వారికి శృతిహాసన్, అక్షరహాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సారికతో అతని బంధం కూడా విడాకులతోనే ముగిసింది. ఆ తర్వాత కమల్ హాసన్ నటి గౌతమితో చాలా కాలం పాటు సహజీవనం చేశారు, కానీ ఆ సంబంధం కూడా తెగిపోయింది. కమల్ హాసన్ తన వ్యక్తిగత జీవితంలో అనేక బంధాలను కలిగి ఉన్నారు, కొన్ని బంధాలు ఆయనకు కుమార్తెలను కూడా ఇచ్చాయి. ఆయన ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా సినీ రంగంలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us