AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

చాలా మంది హీరోలు ఒకే హీరోయిన్ తో నెంబరాఫ్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోలు ఒకే హీరోయిన్ తో రెండు మూడు మహా అయితే నాలుగు సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోలు అలా కాదు పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు.

60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2026 | 12:25 PM

Share

తెలుగులో ఎంతో మంది దిగ్గజ నటులు ఉన్నారు. తమ నటనతో సినిమా ఇండస్ట్రీలో రాణించిన వారు ఉన్నారు. అలాగే తమ సినిమాలతో చరిత్ర సృష్టించిన నటులు ఉన్నారు. అయితే ఓ నటుడు తెలుగు సినిమా చరిత్రలో ఎవరు క్రియేట్ చేయని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లెజెండ్రీ నటుడు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావు లాంటి బడా హీరోల వల్ల కూడా కానీ ఓ రికార్డ్ ను ఓ నటుడు తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరు.? ఆ రికార్డ్ ఏంటో ఒక్కసారి చూద్దాం..! తెలుగు సినీ చరిత్రలో కనుమరుగైన ఒక అరుదైన రికార్డును దివంగత నటుడు చంద్రమోహన్ సొంతం చేసుకున్నారు. ఆయన ఏకంగా 60 మంది కథానాయికలతో కలిసి నటించి, అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన హీరోగా నిలిచారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు వంటి దిగ్గజ నటులు కూడా సాధించలేని అద్భుతమైన ఘనత ఇది.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..

సాధారణంగా, సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం పనిచేసిన అగ్ర నటులు కూడా 40 నుండి 50 మంది హీరోయిన్లతో మాత్రమే పనిచేసేవారు. ఉదాహరణకు, ఎన్టీఆర్ తన కెరీర్‌లో సుమారు 40 మంది హీరోయిన్లతో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు తన నట జీవితంలో మొత్తం 48 మంది కథానాయికలతో కలిసి పనిచేశారు, వీరిలో అంజలీదేవి, జమున, సావిత్రి, భానుమతి, శ్రీదేవి వంటివారు ఉన్నారు. కృష్ణ, శోభన్ బాబు వంటి ఇతర దిగ్గజాలు కూడా దాదాపు ఇదే పరిధిలో హీరోయిన్లతో స్క్రీన్ పంచుకున్నారు. అప్పట్లో ఒక హీరో, ఒక హీరోయిన్ జోడీ తరచుగా రిపీట్ అయ్యేది. సావిత్రి, అంజలీదేవి, జయలలిత, కృష్ణకుమారి, షావుకారు జానకి, జమున, యస్.వరలక్ష్మి వంటి అగ్రతారలు కొన్ని పరిమిత సంఖ్యలో హీరోలతోనే ఎక్కువగా నటించేవారు.

ఇది కూడా చదవండి: జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

దాంతో హీరోలకు ఎక్కువ మంది కథానాయికలతో పనిచేసే అవకాశం ఉండేది కాదు. అయితే, ఈ పరిమితులు చంద్రమోహన్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. చంద్రమోహన్ ఏకంగా 60 మందికి పైగా హీరోయిన్లతో నటించడమే కాకుండా, ఆయనతో నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ అగ్రస్థానానికి చేరుకుంటుందనే ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. ఈ సెంటిమెంట్ వెనుక యాదృచ్ఛికంగానే కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. “నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో ఎక్కువ మంది అగ్రస్థానం చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ, విజయశాంతి ఇలా ఎంతోమందితో నేను తొలి హీరోను. అయితే అందులో నా ప్రతిభ ఏమీ లేదు. అది వారి అదృష్టం, ప్రతిభ” అని చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ వంటి అగ్రశ్రేణి నటులు కూడా సాధించలేని ఈ ఘనత చంద్రమోహన్‌కు దక్కడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :  Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
3 నెలల్లో 50 టన్నుల బంగారాన్ని అమ్మేసిన భారతీయులు..కారణం తెలిస్తే
3 నెలల్లో 50 టన్నుల బంగారాన్ని అమ్మేసిన భారతీయులు..కారణం తెలిస్తే
ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఛార్జింగ్ పెడితే నెలకు ఎంత కరెంట్ బిల్..
ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఛార్జింగ్ పెడితే నెలకు ఎంత కరెంట్ బిల్..
వెనుజులాలో భూకంప విలయం భయానకం..!
వెనుజులాలో భూకంప విలయం భయానకం..!
అతనో మామూలు వ్యక్తి.. అయోధ్యలో ఉద్యోగంతో మారిన లైఫ్‌స్టైల్‌..
అతనో మామూలు వ్యక్తి.. అయోధ్యలో ఉద్యోగంతో మారిన లైఫ్‌స్టైల్‌..
జ్యేష్ఠ పూర్ణిమ రోజే బ్రహ్మ యోగం.. ఈ రాశుల దశ తిరిగినట్లే!
జ్యేష్ఠ పూర్ణిమ రోజే బ్రహ్మ యోగం.. ఈ రాశుల దశ తిరిగినట్లే!
జూలైలో ఈ రాశుల వారు నక్కతోక తొక్కే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా?
జూలైలో ఈ రాశుల వారు నక్కతోక తొక్కే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా?
ఇంట్లో ఉండే చింత పండు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసా?
ఇంట్లో ఉండే చింత పండు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసా?
పెట్రోల్‌ తక్కువగా ఉంటే ముందే హెచ్చరిస్తుంది? లీటర్‌కు 71కి.మీ
పెట్రోల్‌ తక్కువగా ఉంటే ముందే హెచ్చరిస్తుంది? లీటర్‌కు 71కి.మీ
స్వామియే శరణమయ్యప్ప.. ఇరుముడి కట్టు పాట రిలీజ్ చేసిన రవితేజ..
స్వామియే శరణమయ్యప్ప.. ఇరుముడి కట్టు పాట రిలీజ్ చేసిన రవితేజ..
లిఫ్ట్ పేరుతో వల.. ప్రేమజంట మోసం బట్టబయలు..!
లిఫ్ట్ పేరుతో వల.. ప్రేమజంట మోసం బట్టబయలు..!