AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

వంటగదిలో ఎప్పుడూ పుదీనా వాసన గుమగుమలాడుతుంది. చట్నీలు, షర్బత్‌లు, మజ్జిగ.. ఇలా దేనిలోనైనా పుదీనా ఉంటే ఆ రుచే వేరు. పుదీనా చలువ చేస్తుందని, జీర్ణక్రియకు మేలు చేస్తుందని మనందరం భావిస్తుంటాం. అయితే అమృతం అయినా అతిగా తింటే విషమే అన్నట్లు.. పుదీనాను కూడా పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Apr 25, 2026 | 7:02 AM

Share
గ్యాస్ట్రిక్ సమస్యలు - రివర్స్ ఎఫెక్ట్: సాధారణంగా అజీర్తిని పోగొట్టడానికి పుదీనా వాడుతుంటాం. కానీ అదే పుదీనా అతిగా తీసుకుంటే గ్యాస్ట్రో ఈసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనే సమస్యకు దారితీయవచ్చు. పుదీనాలోని మెంతోల్ కడుపులోని కండరాలను సడలిస్తుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లాలు వెనక్కి ప్రవహించి తీవ్రమైన గుండెల్లో మంట ఎసిడిటీకి కారణమవుతాయి. ఇప్పటికే కడుపులో అల్సర్లు లేదా తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నవారు పుదీనాను అధికంగా తీసుకుంటే ఆ సమస్య మరింత జటిలమవుతుంది.

1 / 5
రక్తపోటుపై తీవ్ర ప్రభావం: పుదీనాకు శరీరంలోని రక్తపోటును తగ్గించే గుణం ఉంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మేలు చేసినప్పటికీ, మిగిలిన వారికి ఇబ్బందికరంగా మారవచ్చు. లో బీపీ ఉన్నవారు పుదీనాను డైట్‌లో ఎక్కువగా చేర్చుకుంటే రక్తపోటు మరింత పడిపోయి ఒక్కసారిగా నీరసం రావడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు బీపీకి మందులు వాడుతున్నట్లయితే పుదీనా వాడకంలో అప్రమత్తంగా ఉండాలి.

2 / 5
చర్మ అలర్జీలు - శ్వాస ఇబ్బందులు: పుదీనాలోని మెంతోల్ కొందరి శరీర తత్వానికి అస్సలు పడదు. పుదీనా నూనెను లేదా రసాన్ని నేరుగా చర్మంపై ఎక్కువగా రాస్తే ఎర్రటి దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది. పుదీనా ఘాటు వాసన వల్ల కొంతమందిలో తుమ్ములు రావడం లేదా శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఆస్తమా బాధితులు దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం.

3 / 5
గర్భిణీలు - బాలింతలకు హెచ్చరిక: గర్భధారణ సమయంలో పుదీనాను టీ రూపంలో వికారాన్ని తగ్గించడానికి వాడుతుంటారు. కానీ.. ప్రాచీన వైద్య శాస్త్రాల ప్రకారం.. పుదీనాను విపరీతంగా తీసుకోవడం గర్భాశయానికి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది కొన్ని అరుదైన సందర్భాల్లో ఇబ్బందులకు దారితీయవచ్చు. పాలిచ్చే తల్లులు పుదీనాను అతిగా తీసుకుంటే పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

4 / 5
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్త: పుదీనాను అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పుదీనా ఆయిల్ లేదా పుదీనా సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. దేనికైనా పరిమితి ముఖ్యం. ఎక్కువ తీసుకోకుండా రోజుకు 10 నుంచి 15 పుదీనా ఆకులను వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

5 / 5
Follow Us
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్

బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!

ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే

స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..

ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?

బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!

ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?

కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్