AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఏసీలు వాడతారా..? అయితే ఇంటి పరిసరాల్లో ఈ చెట్టు పెంచండి.. ఎందుకంటే..?

కానుగ చెట్టు శాస్త్రీయ నామం పొంగామియా. వేడిని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఏసీల నుంచి వెలువడే వేడిని, సూర్యరశ్మిని పీల్చుకుంటూ చల్లదనాన్ని అందిస్తుంది. తక్కువ నిర్వహణతో ఏ నేలలోనైనా పెరిగే ఈ వృక్షం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది.

మీరు ఏసీలు వాడతారా..? అయితే ఇంటి పరిసరాల్లో ఈ చెట్టు పెంచండి.. ఎందుకంటే..?
Kanuga Tree
Ram Naramaneni
|

Updated on: Apr 25, 2026 | 8:57 AM

Share

వేసవి కాలంలో కానుగ చెట్టు అందించే నీడ మనందరికీ సుపరిచితం. ఒకప్పుడు మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా కనిపించిన ఈ చెట్లు, కాలక్రమేణా పట్టణీకరణ కారణంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, వాటి పర్యావరణ ప్రయోజనాలు, ప్రత్యేకించి వేడిని తగ్గించే సామర్థ్యంపై అవగాహన పెరిగిన తర్వాత, పట్టణ ప్రాంతాల్లో తిరిగి వాటి ప్రాధాన్యత పెరుగుతోంది. నిపుణులు, నర్సరీల లెక్కల ప్రకారం, కానుగ మొక్కల విక్రయాలు బాగా పెరిగాయి. ప్రజలు వీటి ప్రాముఖ్యతను పెంచి బాగా కోనుగోళ్లు జరుపుతున్నారు. ప్రజలు ఆక్సిజన్ స్థాయిలు, చల్లదనం, కూల్ క్లైమేట్‌ను అందించే ఈ చెట్ల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.  50 నుంచి 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది ఈ చెట్టు. కానుగ చెట్టు గింజల నుంచి తీసే నూనెతో దీపాల్ని వెలిగిస్తారు.

నిపుణులు కానుగ చెట్ల ప్రత్యేకతలను వివరించారు. ఈ చెట్లు ఎలాంటి నేలలోనైనా పెరుగుతాయని, వీటికి నిర్దిష్టమైన నేల అవసరం లేదట. ఇవి పర్యావరణానికి చాలా అవసరమైన వృక్ష జాతి. కానుగ చెట్టు శాస్త్రీయ నామం పొంగామియా, ఇది ఫాబేసీ కుటుంబానికి చెందింది. ఆసియా ఖండంలో విస్తరించి ఉన్న ఈ వృక్షం, భూమిని సారవంతం చేయడంలో కూడా తోడ్పడుతుంది. మన పూర్వీకులు ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని ఉపయోగించుకున్నారని, దీని కలపను వ్యవసాయ పనిముట్లు తయారు చేయడానికి వాడారని చరిత్ర చెబుతోంది. ఆరోగ్యపరంగా ముఖ్యమైనది కాబట్టి దీనిని ఎవరూ అంతగా డిస్టర్బ్ చేయరని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. నేడు, పట్టణాల్లో రోడ్లు విస్తరించడం, స్థల కొరత వంటి కారణాలతో కానుగ చెట్లు అంత విస్తృతంగా కనిపించడం లేదు. అయితే, పెరుగుతున్న వేడిని ఎదుర్కొనేందుకు ఇది ఒక ఆచరణాత్మక పరిష్కారంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా రోడ్లకు ఇరువైపులా కానుగ చెట్లనే నాటడానికి స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం, నాటిన ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మాత్రమే వీటికి నీటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత వర్షాధారంగానే బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంతేకాకుండా, మేకలు, ఆవులు వంటి జంతువులు వీటిని తినకపోవడం వల్ల నిర్వహణ ఖర్చు తక్కువ.

ఇక్కడ హైలెట్ చేయడం వాడాల్సిన మరో విషయం ఏంటంటే.. ఏసీల వాడకం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే వేడిని తగ్గించడంలో కానుగ చెట్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం, పొంగామియా ఇతర మొక్కలతో పోలిస్తే ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. ఏసీల నుంచి వచ్చే రేడియేషన్ వేడిని, అలాగే మధ్యాహ్నపు సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని ఇది సమర్థవంతంగా పీల్చుకుంటుంది. సాధారణ పౌరులు కూడా కానుగ చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను తమ వ్యక్తిగత అనుభవంతో ధృవీకరిస్తున్నారు. ఇంటి ముందు కానుగ చెట్టు నాటడం వల్ల చక్కటి నీడ లభిస్తుందని, పార్కింగ్ కోసం కూడా ఉపయోగపడుతుందని, వేసవిలో చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. కానుగ చెట్టు అనేది కేవలం నీడను ఇచ్చే చెట్టు మాత్రమే కాదు, ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, పట్టణ వాతావరణాన్ని చల్లబరచడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడే ఒక విలువైన వృక్ష సంపద.

సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే 3 పూట్లా ఇదే తింటారు.. 

Follow Us