AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: గ్యాస్ ధరల సెగ.. నేడు మీ నగరంలో సిలిండర్ ధర ఎంత? పూర్తి వివరాలు ఇవే!

LPG Gas Cylinder Prices: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు ఎలా ఉన్నాయి..? గతంలో ఎంత పెరిగాయి? ప్రస్తుతం ఏ నగరంలో ఎంత ధర ఉందో తెలుసుకుందాం.. అలాగే మీరు గ్యాస్ బుక్ చేసుకునే ముందు 'Indane', 'HP' లేదా 'Bharat Gas' అధికారిక వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ఆ రోజు ఉన్న కచ్చితమైన ధరను సరిచూసుకోవడం మంచిది.

LPG Gas: గ్యాస్ ధరల సెగ.. నేడు మీ నగరంలో సిలిండర్ ధర ఎంత? పూర్తి వివరాలు ఇవే!
Lpg Gas Cylinder Price
Subhash Goud
|

Updated on: Apr 25, 2026 | 9:15 AM

Share

LPG Gas: ఈరోజు ఏప్రిల్ 25న దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఎంత పెరిగింది? గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరల మార్పులను గమనిస్తే: డొమెస్టిక్ గ్యాస్ (14.2 KG): కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరను రూ.60 మేర పెంచింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?

కమర్షియల్ గ్యాస్ (19 KG): వాణిజ్య సిలిండర్ ధరలు గత రెండు నెలల్లో రెండుసార్లు పెరిగాయి. మార్చిలో రూ.144 పెరగగా, తిరిగి ఏప్రిల్ 1న మరో రూ.200 పెరిగింది. ఈ వరుస పెంపు వల్ల రెస్టారెంట్లు, చిన్న వ్యాపారస్తులపై పెను భారం పడింది.

ఇవి కూడా చదవండి

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రస్తుతం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కారణమవుతున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతలు: ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రాంతంలో ప్రారంభమైన యుద్ధ వాతావరణం చమురు సరఫరాపై ప్రభావం చూపింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నాకాబందీ: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

హైదరాబాద్‌లో 14.2 కిలోల డోమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.965 రూపాయలు ఉండగా,

అదే 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,320.50 ఉంది. ఇక డొమెస్టిక్‌ 5 కిలోల గ్యాస్‌ ధర రూ.335.50 ఉంది.

విజయవాడలో..

14.2 కిలోల డోమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.937

19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.2,244.50

5 కిలోల డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర రూ.326

  • ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర రూ.913
  • కోల్‌కతాలో రూ.939
  • ముంబైలో రూ.912.5
  • చెన్నైలో రూ.928.5
  • బెంగళూరులో రూ.915.5

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా పునరుద్ధరించబడే వరకు ఇంధన ధరల తగ్గుదలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. వినియోగదారులు తాజా ధరల కోసం తమ గ్యాస్ ప్రొవైడర్ యాప్స్ లేదా వెబ్‌సైట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us