AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని భారత దేశంలోని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అల్లం, వెల్లుల్లి లేకుండా సాధారణంగా ఏ వంట కూడా పూర్తి కాదు. అందులోనూ ఫాస్ట్‌ ఐటెమ్స్‌లో ఖచ్చితంగా అల్లం కానీ, వెల్లుల్లి కానీ ఉండాల్సిందే. వీటితోనే వంటలకు రుచి వస్తుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా.. ఈ అల్లం వెల్లులి పేస్ట్ ఉపయోగించడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అన్ని వస్తువులు సిద్ధంగా ఉంటేనే వంట త్వరగా పూర్తి అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలో వేయాలంటే..

Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Allam Vellulli Paste
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 2:50 PM

Share

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని భారత దేశంలోని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అల్లం, వెల్లుల్లి లేకుండా సాధారణంగా ఏ వంట కూడా పూర్తి కాదు. అందులోనూ ఫాస్ట్‌ ఐటెమ్స్‌లో ఖచ్చితంగా అల్లం కానీ, వెల్లుల్లి కానీ ఉండాల్సిందే. వీటితోనే వంటలకు రుచి వస్తుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా.. ఈ అల్లం వెల్లులి పేస్ట్ ఉపయోగించడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అన్ని వస్తువులు సిద్ధంగా ఉంటేనే వంట త్వరగా పూర్తి అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలో వేయాలంటే.. అప్పటికప్పుడు రుబ్బి వేయాలంటే కష్టమే. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.. త్వరగా పాడైపోతుంది. సరైన పద్దతిలో నిల్వ చేస్తే అల్లం వెల్లులి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది. మరి అదెలాగో.. ఎలాంటి ట్రిక్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు – ఆయిల్ వేయండి:

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఉప్పు లేదా నూనె వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా రుబ్బిన అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది.

వెనిగర్ జోడించండి:

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఆకు పచ్చ రంగులోకి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు.. కొద్దిగా వెనిగర్‌ని కలపండి. దీంతో కలర్ మారకుండా, రుచి ప్రభావితం కాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నీటిని వేయకండి:

అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోవడానికి అసలు కారణం నీళ్లు. చాలా మంది ఈ మిశ్రమాన్ని రుబ్బేటప్పుడు నీటిని జోడిస్తారు. దీని వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నీటిని వేయకుండా రుబ్బితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే రుచి కూడా పోదు.

గాలి తగలకుండా చూడండి:

ఎలాంటి ఆహార పదార్థాలైనా.. మిశ్రమాలైనా.. గాలి తగిలితే త్వరగా పాడైపోతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గాలి తగలకుండా కంటైనర్ ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడం మంచిది. అదే విధంగా ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us