Nutrition Facts: ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ అని మోసపోకండి! మీ డైట్ లో ఇది ఉంటే షుగర్ రావడం ఖాయం!
ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా జెన్ జీ (Gen Z) యువతకు ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ అంటే మహా ఇష్టం. అందులోనూ కార్న్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లోర్ వంటివి ఆరోగ్యకరమని భావిస్తుంటారు. అయితే, మనం వాడే తెల్లని కార్న్ ఫ్లోర్ కేవలం 90 శాతం కార్బోహైడ్రేట్లతో నిండిన ఒక శుద్ధి చేసిన పిండి మాత్రమేనని మీకు తెలుసా? ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు దాదాపు శూన్యం. మరి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేక మధుమేహం వంటి ముప్పులకు దారితీస్తుందా? కార్న్ ఫ్లోర్‌కు సంబంధించిన ఈ షాకింగ్ నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డైట్ ఫుడ్ అని మనం నమ్మే చాలా పదార్థాలు అసలు ఆరోగ్యకరమేనా? ముఖ్యంగా కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) విషయంలో మనం పెద్ద గందరగోళంలో ఉన్నాం. పాలిష్ చేసిన తెల్లని కార్న్ ఫ్లోర్ కు, ఉత్తర భారతదేశంలో వాడే సంప్రదాయ మొక్కజొన్న పిండికి మధ్య చాలా తేడా ఉంది. ప్రోటీన్లు లేని పిండిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా పెరుగుతాయో.. ఆరోగ్యకరమైన ఎంపిక ఏంటో ఈ ప్రత్యేక విశ్లేషణలో చూడండి.
శుద్ధి చేసిన పిండి (Processed Corn Flour): మార్కెట్‌లో లభించే తెల్లని కార్న్ ఫ్లోర్ 90% కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. తయారీ ప్రక్రియలో దీనిలోని పీచు పదార్థం ప్రోటీన్లను పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల ఇది కేవలం ‘ఖాళీ కేలరీల’ ఆహారంగా మారుతుంది.
మధుమేహం ముప్పు: కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండటం వల్ల, దీనిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదు.
హోల్ కార్న్ పిండి : దీనికి భిన్నంగా, ఉత్తర భారతదేశంలో వాడే మక్కాచోళ పిండిలో పోషకాలు మెండుగా ఉంటాయి. 100 గ్రాముల పిండిలో 10 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.
ఎముకల ఆరోగ్యం: సంప్రదాయ పద్ధతిలో తయారైన మొక్కజొన్న పిండిలో ఎముకల బలానికి అవసరమైన ఫాస్పరస్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. వీటితో రొట్టెలు, దోసెలు చేసుకోవడం ఆరోగ్యకరం.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
