AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloud Coffee: రోజుని క్లౌడ్ కాఫీతో మొదలు పెట్టండి? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..! రెసిపీ ఏమిటంటే..

కొంతమందికి రోజుని కాఫీ తాగడంతో మొదలు పెడతారు. ప్రస్తుతం రకరకాల కాఫీలు కాఫీ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కాఫీ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ కాఫీ పేరు క్లౌడ్ కాఫీ. ఈ కాఫీ నెటిజన్ల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ రోజు కోల్డ్ కాఫీ అంటే ఏమిటి? దీనిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Cloud Coffee: రోజుని క్లౌడ్ కాఫీతో మొదలు పెట్టండి? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..! రెసిపీ ఏమిటంటే..
Cloud Coffee
Surya Kala
|

Updated on: Jun 28, 2025 | 6:16 PM

Share

కరోనా తర్వాత సోషల్ మీడియాలో రకరకాల ఆహారపదార్ధాలు చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు టీ, కాఫీల తయారీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొన్ని రకాల కాఫీ తయారీ విధానంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు అలా టిక్‌టాక్‌లో తుఫానుగా చుట్టేస్తున్న కొత్త ఫుడ్ ట్రెండ్ ‘క్లౌడ్ కాఫీ. ఈ ఐస్డ్ డ్రింక్ కేవలం సాధారణ కాఫీ కాదు. ఉష్ణమండల శైలితో తయారు చేయబడిన ఈ కాఫీ మంచి పోషకాలతో నిండి ఉంటుంది. అంతేకాదు ఈ కాఫీ రిఫ్రెషింగ్ పానీయం అని చెప్పబడింది. ఈ రోజు కోల్డ్ కాఫీ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఈ కాఫీని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

క్లౌడ్ కాఫీ అంటే ఏమిటి: దానిని ఎలా తయారు చేయాలి? క్లౌడ్ కాఫీతో రోజుని ప్రారంభించే అదొక మధురమైన అనుభూతి అంటున్నారు కాఫీ ప్రియులు. ఈ పానీయం.. ఉదయం తాగడం వలన మంచి ఉత్సాహం లభిస్తుంది. ఈ కాఫీని తయారు చేయడనికి సాదా నీటిని ఉపయోగించటానికి బదులుగా ఈ కాఫీ కొబ్బరి నీళ్ళతో తయారు చేయబడుతుంది. తరువాత పైన ఎస్ప్రెస్సో షాట్ వేయబడుతుంది. ఆ తరువాత.. ఈ కాఫీకి ఏదైనా తక్కువ కేలరీలు లేదా మొక్కల ఆధారిత పాలను జోడించవచ్చు. ఈ చల్లని పానీయం సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పానీయం ఐస్డ్ అమెరికానో,డాల్గోనా కాఫీ వంటి పానీయాల నుంచి ప్రేరణ పొందింది. ఈ సీజన్ లో తేలికైన, గాలితో కూడిన మూడ్‌కు సరిగ్గా సరిపోయే చాలా సులభంగా తయారు చేయగల పానీయం.

క్లౌడ్ కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు క్లౌడ్ కాఫీ గొప్ప రుచిని కలిగి ఉండటమే కాదు దీని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది సాధారణ కాఫీ కంటే దీనిని ఇష్టపడతారు. సాధారణ నీటిని కొబ్బరి నీటితో భర్తీ చేయడం వల్ల పోషకాలు పెరగడంతో పాటు, ముఖ్యంగా వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండాలని కోరుకునే వారికి బెస్ట్ ఎంపిక.

ఇవి కూడా చదవండి

“కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఉండటం వల్ల కాఫీని కొబ్బరి నీళ్లతో కలపడం వల్ల అది కొంచెం హైడ్రేటింగ్‌గా మారుతుంది” అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కాఫీ టేస్ట్ , పోషకాలు ఒక బ్రాండ్ నుంచి మరొక బ్రాండ్‌కు తేడా ఉండవచ్చు. అయితే ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 470 mg పొటాషియం,19 mg మెగ్నీషియం ఉన్నాయి. ఇది రోజువారీ అవసరాలలో దాదాపు 5% కవర్ చేస్తుంది.

“మొత్తం మీద ఎవరైనా ఈ కాఫీ రుచిని ఇష్టపడితే ఉదయపు పానీయంలో కొన్ని అదనపు పోషకాలను అందించేందుకు ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. అంతేకాదు కొబ్బరి నీరు హైడ్రేషన్‌కు సహాయపడటానికి ఎలక్ట్రోలైట్‌లను జోడిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తినిచ్చే యాంటీఆక్సిడెంట్‌లతో పాటు శరీరం ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది చక్కెర క్రీమ్ లకు తేలికైన, హైడ్రేటింగ్ ప్రత్యామ్నాయం.” కనుక క్రీమీయర్ టెక్స్చర్ ఇష్టపడే వారికి బాదం-కొబ్బరి పాల మిశ్రమంతో ఉన్న క్లౌడ్ కాఫీని తాగమని సిఫార్సు చేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)