AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Laddu Recipe: కొబ్బరి మామిడి లడ్డు తిన్నారా? ఈ విధంగా చేస్తే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు

మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈ వేసవి కాలం చాలా మందికి ఇష్టమైనది. మామిడి పండ్ల రుచి అద్భుతంగా ఉంటుంది. మామిడి కాయతో మాత్రమే పండ్లతో కూడా రకరకాల రుచికరమైన ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే కొంతమంది మామిడి పండ్లతో రకరకాల కొత్త తరహా ఆహారపదార్థాలను తయారు చేస్తారు. అలాంటి వారు మామిడి లడ్డులను ట్రై చేయండి. ఈ రోజు మామిడి లడ్డు రెసిపీ తెలుసుకుందాం.

Mango Laddu Recipe: కొబ్బరి మామిడి లడ్డు తిన్నారా? ఈ విధంగా చేస్తే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు
Coconut Mango Laddu
Surya Kala
|

Updated on: Jun 28, 2025 | 4:28 PM

Share

మామిడిని పండ్లకు రాజు అని అంటారు. దీని రుచి, పోషక విలువలు మామిడికి రాజు అనే బిరుదును ఇచ్చాయి. భారతదేశంలోని ప్రజలు వేసవి కాలం కోసం.. ముఖ్యంగా మామిడి పండ్లు వచ్చే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఏదోక సమయంలో మామిడి సువాసన వస్తుంది. అనేక రకాల పానీయాలు, డెజర్ట్‌లు మామిడితో తయారు చేస్తారు. వీటిలో తెలుగు వారి లోగిల్లో మామిడి తాండ్ర అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే డిఫరెంట్ గా మీరు ఎప్పుడైనా మామిడి లడ్డులను ప్రయత్నించారా? లేకపోతే ఈ సీజన్‌లో మీరు ఖచ్చితంగా ఈ లడ్డులను ట్రై చేయండి. వీటిని పిల్లలతో పాటు మొత్తం కుటుంబం ఇష్టంగా తింటారు. ఈ లడ్డులను తయారు చేసే పద్ధతి చాలా సులభం.

మామిడి లడ్డులను తయారు చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఫ్రిజ్‌లో సులభంగా నిల్వ చేయవచ్చు. మొత్తం కుటుంబంతో కలిసి వాటిని ఆస్వాదించవచ్చు. ఈ లడ్డులు చాలా రుచికరంగా ఉంటాయి. మామిడి పండ్లు లడ్డులను తిన్నవారు పొగడ్తల వర్షం కురిపిస్తారు. మామిడి తీపి సహజమైనది. కనుక ఈ లడ్డుకి ఎక్కువ చక్కెర జోడించాల్సిన అవసరం ఉండదు. కనుక ఈ లడ్డులు ఆరోగ్యం దృష్ట్యా మంచివి. రెసిపీని తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

మామిడి పండ్లు- 2 (బాగా పండిన బంగిన పల్లి, లేదా తక్కువ ఫైబర్ ఉన్న తీపి ఉండే మామిడి పండ్లు)

ఇవి కూడా చదవండి

కొబ్బరి- ఒక కప్పు

యాలకుల పొడి – ఒక టీస్పూన్

పాలపొడి- పావు కప్పు

దేశీ నెయ్యి -రెండు టీస్పూన్లు

చక్కెర- రెండు టీస్పూన్లు

పిస్తాపప్పులు

జీడిపప్పు

మామిడి లడ్డు తయారీ విధానం: ముందుగా మామిడికాయను ముక్కలుగా కట్ చేసి ఈ గుజ్జును తీసి మిక్సీలో వేసి షుగర్, యాలకుల వేసి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత కొబ్బరి కోరుని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున ఉన్న పాన్‌లో తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేసి అందులో కొబ్బరి కోరు వేసి కొంతసేపు వేయించాలి. ఆ తర్వాత మామిడికాయ గుజ్జు, పాలపొడి వేసి, తేమ ఆరిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన దేశీ నెయ్యి కూడా వేసి కలపాలి. చివరిగా జీడి పప్పు, పిస్తాపప్పులు వేసి కలపండి. కొన్నింటిని లడ్డులను అలంకరించడానికి పక్కకు పెట్టుకోండి.

ఈ మామిడి మిశ్రమం లడ్డులు చుట్టుకునే విధంగా మందంగా మారే వరకూ వేడి చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. చేతికి నెయ్యి అద్దుకుని కొంత మిశ్రమాన్ని తీసుకుని గుండ్రని ఆకారంలో చుట్టుకోండి. తర్వాత ఈ మామిడి లడ్డులను తురిమిన కొబ్బరిని అద్ది.. వాటిని ఒక ప్లేట్‌లో ఉంచిన తర్వాత తరిగిన పిస్తాపప్పులు, జీడిపప్పులతో అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ మామిడి లడ్డులు సిద్ధం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..