AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు వెరీ వెరీ స్పెషల్.. పెద్ద గుండ్రని కళ్ళ వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్ధం. అన్ని దేవతల విగ్రహాలకంటే జగన్నాథుని విగ్రహం డిఫరెంట్ గా ఉంటుంది. అసంపూర్ణంగా ఉన్నా జగన్నాథుని రూపం అద్భుతంగా ఉంటుంది. ఓ చిన్న పిల్లవాడిలా కనిపిస్తుంది. చేతులు కాళ్ళు లేకున్నా స్వామివారి పెద్ద పెద్ద గుండ్రని కళ్ళుతో చాలా ముగ్దమనోహరంగా కనిపిస్తాడు. అతని ఈ రూపం ఎందుకు భిన్నంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా.. అంతేకాదు అసలు జగన్నాథుడికి పెద్ద గుండ్రని కళ్ళు ఎందుకు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీ కోసం

జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు వెరీ వెరీ స్పెషల్.. పెద్ద గుండ్రని కళ్ళ వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
Puri Jagannath
Surya Kala
|

Updated on: Jun 28, 2025 | 2:43 PM

Share

జగన్నాథుని రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆయన ప్రతిమను చూసిన ప్రతి ఒక్కరూ అలా విగ్రహాని మైమరచి చూస్తూనే ఉంటారు. విగ్రహానికి చేతులు, కాళ్ళు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కళ్ళు ఉంటాయి. కానీ కనురెప్పలు ఉండవు. ఈ దేవుని విగ్రహం సాధారణమైనది కాదు. ఈ ఆశ్చర్యకరమైన విగ్రహం భక్తులను తన వైపు ఆకర్షిస్తుంది. అసలు దేవుని ప్రతిమ ఎందుకు ఇలా ఉంది. దేవునికి అంత పెద్ద, వెడల్పు , గుండ్రని కళ్ళు ఎందుకు ఉన్నాయి. ఈ రోజు మనం ఈ రోజు తెలుసుకుందాం..

పూరీలో ఉన్న ప్రతి ఒక్కరికీ జగన్నాథుడి రూపం ,ఆయన ముఖ కవళికలు తెలుసు. ప్రతి ఒక్కరికీ భగవంతునికి సంబంధించిన ఏదో ఒక కథ ఉంటుంది. ఆయన రూపం, ఆయన అద్భుతమైన విగ్రహం గురించి అనేక సంబంధించిన చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలలో ఒకటి ఆయన పెద్ద, పెద్ద విశాలమైన కళ్ళు. కనుక ఈ రోజు జగన్నాథునికి పెద్ద కళ్ళు ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం.

జగన్నాథుని పెద్ద కళ్ళ రహస్యం

ఇవి కూడా చదవండి

దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఈ కథ శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించిన కాలం నాటిదని నమ్ముతారు. ఒకరోజు బలరాముడి తల్లి రోహిణి కృష్ణుడు, బలరాముడి బాల్యం గురించి ద్వారకలోని రాణులకు చెప్పడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె సుభద్రను తలుపు వద్ద నిలబడమని కోరింది. బృందావనంలోని రాసలీల సమయంలో సుభద్ర తప్పిపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేయడం ప్రారంభించింది. ఆమె ఏమి చూస్తుంది అనే కుతూహలం అన్నలైన శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరూ ఆమె పక్కనే వచ్చి నిలబడ్డారు. వారు కూడా ఆ కథలో నిమగ్నమై.. ముగ్గురు తోబుట్టువులు ఆశ్చర్యంతోకి వెళ్లడంతో అప్పుడు ఆ ఇద్దరి అన్నదమ్ముల కళ్ళు పెద్దవి అయ్యాయి. ఈ సమయంలో నారద ముని అక్కడికి చేరుకుని ముగ్గురు తోబుట్టువుల ఈ రూపాన్ని చూసి.. భక్తులు కూడా ఈ రూపాన్ని చూడాలని తాను కోరుకుంటున్నానని.. కృష్ణుడు ఈ విషయంపై ప్రార్థిస్తున్నాను అని అన్నారు. అందుకే జగన్నాథుడి విగ్రహం విశ్వకర్మ తయారు చేస్తున్నప్పుడు.. ఈ రూపం ఉద్భవించిందని చెబుతారు. ఈ రూపాన్ని నేటికీ భక్తులు చూస్తున్నారు.

దేవుడు తన భక్తుల భావాలతో అనుసంధానిస్తాడు.

భగవంతుని పెద్ద గుండ్రని కళ్ళ వెనుక మరొక కథ దాగి ఉంది. ఒడిశాలోని పూరిలోని ఇంద్రద్యుమ్నుడి రాజ్యంలో జగన్నాథుడు కనిపించినప్పుడు.. భక్తులు ఆయన వైపు చూస్తూనే ఉన్నారని, వారి కళ్ళు విశాలంగా తెరిచి ఉన్నాయని చెబుతారు. ఆయన రూపాన్ని చూసిన తర్వాత అందరి కళ్ళు పెద్దవి అయ్యాయి. భక్తుల ఈ భక్తిని దేవుడు చూశాడు. దేవుడు కూడా అదే విధంగా ఆశ్చర్యంతో తన కళ్ళను పెద్దవి చేసాడు. జగన్నాథుడు తన భక్తులు చెప్పే ప్రతిదాన్ని వింటాడని.. వారి భక్తిలో మునిగిపోతాడని చెబుతారు. వారి భావాల ఈ రూపాన్ని జగన్నాథుని విగ్రహంలో కూడా చూడవచ్చు.

పూరీలోని ప్రతి పిల్లల నోట జగన్నాథునికి సంబంధించిన కథలు అనేకం వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ జగన్నాథునికి సంబంధించిన కథలు చెబుతారు. ఆయనపై నమ్మకం, విశ్వాసం కూడా కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు