Kitchen Hacks: కోడి గుడ్డు పొట్టును ఇలా ఈజీగా తీసేయవచ్చు..

గుడ్లను తినేందుకు ఉండని సమస్య.. కోడి గుడ్డు పొట్టు తీసేటప్పుడు ఉంటుంది. ఎంత బాగా ఉడకబెట్టినా ఒక్కోసారి కోడి గుడ్ల పొట్టు సరిగా రాదు. దీంతో నెమ్మదిగా కూర్చొని తీస్తూ ఉంటారు. ఈ క్రమంలో టైమ్ వేస్ట్ అవుతుందని అనుకుంటారు. అలా కాకుండా ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది..

Kitchen Hacks: కోడి గుడ్డు పొట్టును ఇలా ఈజీగా తీసేయవచ్చు..
Kitchen Hacks
Follow us
Chinni Enni

|

Updated on: Nov 09, 2024 | 4:26 PM

కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు మనకు గుడ్లలో లభిస్తాయి. గుడ్లు తినడం చాలా మంచిది. అందులోనూ చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఉడకబెట్టిన గుడ్లు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ చాలా మంది ఉడకబెట్టి గుడ్లు తింటూ ఉంటారు. అలాగే కూరలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఉడకబటెట్టిన గుడ్ల పెంకులు త్వరగా రావు. త్వరగా తీసే క్రమంలో ఒక్కోసారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. కానీ ఈ చిట్కాలు పాటిస్తే కోడిగుడ్ల పెంకులను చాలా సింపుల్‌గా తీసేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ముందు నీటిని మరిగించండి:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే గుడ్లతో నేరుగా నీరు పోసి.. డైరెక్టుగా పెయ్యి మీద ఉడకిస్తారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి పెంకు గుడ్డకు అతుక్కుపోయి రాదు. అలా కాకుండా ముందుగా నీటిని గిన్నెలో మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో గుడ్లను వేయడం వల్ల.. గుడ్లు త్వరగా ఉడకడమే కాకుండా పొట్టు కూడా సులభంగా వచ్చేస్తుంది.

నీటిలో ఉంచండి:

ఎప్పుడైనా సరే గుడ్లు ఉడికిన వెంటనే పొట్టు తీసేందుకు ట్రై చేస్తారు. అలా కాకుండా ఉడికిన తర్వాత గుడ్లను చల్ల నీటిలో వేయండి. ఓ పది నిమిషాల తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా వేయండి:

నీటిలో గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. ఇలా ఉడికించడం వల్ల త్వరగా గుడ్డు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది.

దొర్లించండి:

గుడ్లను ఉడకబెట్టిన తర్వాత ఒకసారి చల్ల నీటిలో వేసి.. చల్లగా అయిన తర్వాత కింద పెట్టి అరచేతి సహాయంతో గుడ్డును అటూ ఇటూ దొర్లించాలి. ఇలా చేసినా కూడా కోడి గుడ్డు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది.

గాస్ సహాయంతో:

కోడి గుడ్డు పొట్టు తీయడానికి ఈ చిట్కా కూడా చక్కగా పని చేస్తుంది. ఉడికిన తర్వాత గుడ్డును కాస్త చల్లార నివ్వాలి. ఆ తర్వాత ఓ గ్లాస్‌లో వేయండి. గ్లాస్ పైన ఓ మూత పెట్టి షేక్ చేసినా కూడా తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్న సింపుల్ చిట్కాలతో కోడి గుడ్డు తొక్కను ఈజీగా తీసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.