Orange Peels: నారింజ పండు తొక్కలను పడేస్తున్నారా.? ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకండి.!
నారింజ పండు తొక్కలను చాలా మంది పడేస్తుంటారు. పండ్లను తిన్న తరువాత తొక్కలను పడేస్తారు. అయితే వాస్తవానికి ఈ తొక్కల్లోనూ అనేక పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. నారింజ పండుతో పాటు తొక్కలను కూడా తినవచ్చని చెబుతున్నారు. ఈ తొక్కలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే నాడీ సంబంధ వ్యాధులు రావని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ అనే ఓ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం నారింజ పండు తొక్కలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని వెల్లడైంది. నారింజ పండు తొక్కల్లో విటమిన్లు అనేకం ఉంటాయి. ఈ తొక్కల్లో ఉండే పాలిఫినాల్స్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. నారింజ పండు తొక్కల్లో పెక్టిన్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. నారింజ పండు తొక్కల్లో ఉండే ఫైబర్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రోజూ వ్యాయామం చేస్తూ ఈ తొక్కలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మొటిమలు, జిడ్డు చర్మం సమస్యలను తగ్గించడంలో నారింజ పండు తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. నారింజ పండు తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. దీంతోపాటు చర్మంపై ఉండే దురదను, దద్దుర్లను తగ్గిస్తాయి. నారింజ పండ్ల తొక్కను కొందరు ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. నారింజ పండు తొక్కలను నేరుగా తినలేరు. నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని వాడుకోవచ్చు. దాంతో డికాషన్ తయారు చేసి తాగవచ్చు. ఇలా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.