APSRTC: RTCలో 606 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్షా లేదు.! కానీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ, కర్నూలు జోన్లలోని వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 606 ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో నవంబర్ 20, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్షా ఉండదు.
ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో 295 అప్రెంటిస్ ఖాళీలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు వస్తాయి. కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు వస్తాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 06, 2024 నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 20, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సీనియార్టీ అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద 118 రూపాయిలు చెల్లించాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.