Viral: నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం.! వీడియో వైరల్..
నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా భక్తులు నాగుల చవితిరోజు కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరూ కలిసి పుట్టలో పాలు పోసి నాగదేవతను పాము రూపంలో ఆరాధిస్తారు. తమ పిల్లలను, కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ సుభ్రమణ్యుని వేడుకుంటారు. సంతానం లేనివారు నాగులచవితి, నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
నాగదేవతను ఆరాధించేందుకు పుట్టవద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు భక్తులు. అయితే వారికి మార్గ మధ్యలో అద్భుతమైన దృశ్యం వారి కంటపడింది. నాగుపాము, జెర్రిపోతు సయ్యాటలాడుతూ కనిపించాయి. నాగుల చవితి పర్వదినాన ఇలా జంటపాముల దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలోని సూర్యకాలనీలో చోటుచేసుకుంది. పొదల్లోనుంచి సయ్యాటలాడుతూ రోడ్డుమీదకు వచ్చిన జంటపాములు చుట్టూ గుమిగూడిన జనాల అలజడిని కూడా పట్టించుకోకుండా సయ్యాటలాడాయి. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మనుషుల కంటపడుతుంటాయి. కార్తీక మాసం, మంగళవారం, నాగుల చవితి పర్వదినం ఈ పుణ్యదినాన జంటపాముల సయ్యాట దృశ్యం చూసి భక్తులు ఆనందంతో దర్శనం చేసుకున్నారు. మంగళవారం సుభ్రమణ్యునికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈరోజు ప్రత్యక్షంగా స్వామి దర్శనం కలిగిందని, ఇది తమ అదృష్టం అంటూ భక్తులు భక్తితో నమస్కరించి పూజలు చేశారు. జంటపాములు సయ్యాటలాడుతున్న స్థలంలో తెల్లని నూతన వస్త్రాలు పరిచి, పసుపు కుంకుమలు, నైవేద్యాలతో పూజలు చేశారు. భక్తితో నమస్కరించారు. సయ్యాట ముగిసిన అనంతరం జంటపాములు తలో దిక్కూ వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

