Watch: మర్డర్ చేసి తప్పించుకోవాలనుకున్నాడు.. ఈగలు చేసిన పనికి ఇలా దొరికిపోయాడు.!
హత్య చేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈగలు కారణంగా అతను పోలీసులకు దొరికిపోయాడు. అదెలా అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో అక్టోబరు 30న ఓ హత్య జరిగింది. పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఊరు చివరనున్న పంట పొలాల్లో మనోజ్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.
గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహం ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ గుమిగూడిన జనంలో ఉన్న ధరమ్ ఠాకూర్ శరీరంపై విపరీతంగా ఈగలు వాలడం పోలీసులు గమనించారు. ఠాకూర్ పై అనుమానంతో.. పోలీసులు ఆయనను పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతిపై రక్తపు మరకలు కనిపించాయి. దాంతో తమదైన శైలిలో విచారించగా.. మనోజ్ ను తానే హత్య చేసినట్లు ఠాకూర్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్‌లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాఫ్తులో తెలిసింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

