AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana peel Face Pack: అరటి తొక్కతో ఫేస్‌ ప్యాక్‌.. ఇలా చేస్తే చందమామ లాంటి అందం మీ సొంతం!

అందంగా కనిపించడానికి చాలా మంది రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటారు. కానీ ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచే బదులు వీటి వల్ల రకరకాల దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సహజ పద్ధతిలో అందానికి మెరుగులు దిద్దవచ్చు. అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ చాలా మంది..

Banana peel Face Pack: అరటి తొక్కతో ఫేస్‌ ప్యాక్‌.. ఇలా చేస్తే చందమామ లాంటి అందం మీ సొంతం!
Banana Peel Face Pack
Srilakshmi C
|

Updated on: Aug 25, 2025 | 2:37 PM

Share

మెరిసే చర్మం ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే అందంగా కనిపించడానికి చాలా మంది రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటారు. కానీ ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచే బదులు వీటి వల్ల రకరకాల దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సహజ పద్ధతిలో అందానికి మెరుగులు దిద్దవచ్చు. అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ చాలా మంది అరటి పండు తిన్నాక తొక్క పడేస్తుంటారు. దానిని పారేసే బదులు, చర్మానికి ఇలా ఉపయోగించడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. అరటి తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కలను ముఖానికి అప్లై చేస్తే ముఖం శుభ్రంగా మారుతుంది. చర్మంపై మృత కణాలను బయటకు పంపిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎండ కారణంగా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తొలగిస్తుంది. టానింగ్ తగ్గుతుంది. ముఖం మెరుస్తుంది. ఇందుకోసం ఇంట్లోనే అరటి తొక్కలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే..

అరటి తొక్క ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా అరటిపండు తొక్కను కొన్నింటిని తీసుకొని మెత్తగా.. పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ అరటిపండు తొక్క పేస్ట్‌లో అర చెంచా బియ్యం పిండి, అర చెంచా చక్కెర కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముఖం మీద అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే అనతి కాలంలోనే మంచి గుణం కనిపిస్తుంది. బియ్యంలో స్టార్చ్ ఉంటుంది. ఇది చర్మానికి మెరుపు, బిగుతును ఇస్తుంది. చక్కెరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. అరటిపండులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలు, చిన్న చిన్న మచ్చలు, టానింగ్ ని వెంటనే తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి
  • అరటిపండు తొక్క వెనుక భాగాన్ని కూడా ముఖం మీద రుద్దవచ్చు. ఈ తొక్కను ముఖం మీద రుద్దడం వల్ల మృత కణాలు తొలగిపోవడమే కాకుండా ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
  • అరటిపండు తొక్కను మెత్తగా రుబ్బి, తేనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేసి ముఖంపై అప్లై చేస్తే.. ముఖ్యం తాజాగా కనిపించేలా చేస్తుంది. అలాగే అరటిపండు తొక్కను గ్రైండ్ చేసి, దానికి పెరుగు వేసి బాగా కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మీద అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోయి సహజంగా ముఖ్యం ప్రకాశవంతంగా మారుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.