Lemon Water: పొద్దున్నే నిమ్మనీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? ఐతే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం నీటిలో కలిపి తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పలు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. నిమ్మరసం అమృతం లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ అది అధికమైతే విషపూరితంగా మారుతుంది. నిజానికి

Lemon Water On An Empty Stomach
కొంతమంది నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం నీటిలో కలిపి తాగుతుంటారు. ఈ అలవాటు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పలు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. నిమ్మరసం అమృతం లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ అది అధికమైతే విషపూరితంగా మారుతుంది. నిజానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కోరికతో చాలా మంది వివిధ ఆరోగ్య చిట్కాలను అనుసరించడం సహజం. కానీ వాటి నుండి లభించే ప్రయోజనాలతో పాటు, దుష్ప్రభావాలను కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం అందరికీ మంచిది కాదు. కాబట్టి దీని వినియోగం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
- ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలోని ఆమ్లత్వం ఎముకలలోని కొవ్వును తగ్గించి, వాటిని బలహీనపరుస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ ఎముక సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా కడుపులో మంట, వాంతులు, అపాన వాయువు వంటి సమస్యలు వస్తాయి.
- నిమ్మకాయలోని ఆమ్లత్వం డెంటిన్‌ను దెబ్బతీస్తుంది. ఇది పళ్లను సున్నితంగా మారుస్తుంది. ఇది దంతాల బలాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. కాబట్టి నిమ్మరసం మితంగా మాత్రమే తీసుకోవాలి.
- ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
- నిమ్మకాయలోని కొన్ని లక్షణాలు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. అందువల్ల, ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం అంత మంచిది కాదు. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా ప్రమాదకరం. అందుకే భోజనం తర్వాత నిమ్మరసం తాగాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు.
- నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల విరేచనాలు, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో శరీరం గ్రహించగలిగే దానికంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. నిమ్మరసంలోని ఆమ్లత్వం గొంతులోని శ్లేష్మ పొరను చికాకుపెడుతుంది. గొంతు నొప్పికి కారణమవుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




